Devara NTR movie : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రీసెంట్గా ప్రారంభమైన సంగతి సినీ ప్రియులకు తెలిసిన విషయమే. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ సాగింది. తాజాగా ఇది పూర్తైనట్లు సమాచారం అందింది.
ఇందులో భాగంగా ఓ కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు రీసెంట్గా వార్తలు కూడా వచ్చాయి. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వం వహించినట్లు సమాచారం అందింది. అయితే తాజాగా సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు కూడా ఓ పోస్ట్ చేస్తూ.. ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలిపారు. ఎక్స్ట్రీమ్ లోలైట్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో వేసిన సెట్లో స్పెషల్ నైట్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ రూపొందినట్లు ఓ ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దాన్ని ట్రెండ్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. సినిమాపై మరింత అంచనాలను పెంచేసుకుంటున్నారు.
NTR 30 cast and crew : ఇకపోతే ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని అంతా అంటున్నారు. ఈ సినిమా తారక్ ఓ సరికొత్త లుక్‌తో కనిపించనున్నట్లు ఇప్పటికే రిలీజైన పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు.