Dev Kohli Death : ప్రముఖ గేయ రచయిత దేవ్ కోహ్లీ ముంబయిలో కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 'మైనే ప్యార్ కియా', 'బాజీగర్', 'జుడ్వా 2', 'ముసాఫిర్', 'షూట్ అవుట్ ఎట్ లోఖండ్‌వాలా', 'టాక్సీ', 'నంబర్ 911' లాంటి 100 కంటే ఎక్కువ హిట్ చిత్రాలకు పాటలు రాశారు. అంతే కాకుండా అను మాలిక్, రామ్ లక్ష్మణ్, ఆనంద్ రాజ్ ఆనంద్, ఆనంద్ మిలింద్ వంటి సంగీత దర్శకులతో కలిసి అనేక హిట్‌లు సాంగ్స్‌ను రూపొందించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తన రచనలతో సినీ ఇండస్ట్రీని ఏలిన ఆయన మ్యూజిక్ లవర్స్‌కు ఎన్నో హిట్ సాంగ్స్‌ను అందించారు.
Dev Kohli Death : బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత మృతి - lyricist Dev Kohli death
Dev Kohli Death : ప్రముఖ గేయ రచయిత దేవ్ కోహ్లీ ముంబయిలో కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Published : Aug 26, 2023, 10:38 AM IST
|Updated : Aug 26, 2023, 2:34 PM IST
1971లో విడుదలైన 'లాల్ పత్తర్' సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. 'గీత్ గాతా హూన్ మైన్... హమ్ గునునతా హూన్...అనే పాటను అలవోకగా రాసి దర్శకుడిని ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఆయన గురించి ఎవరికీ అంతగా తెలియలేదు. కానీ ఆయన పట్టు వదలకుండా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక 'మైనే ప్యార్ కియా' సినిమా పాటలైతే ఒక్కోటి ఒక్కో సూపర్ హిట్. 'హమ్ ఆప్కే హై కౌన్' అనే సినిమాలోని 'దీదీ తేరా దేవర్ దీవానా', 'చాక్లెట్ ఐస్ క్రీమ్' సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ ఛార్ట్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో హిట్ సాంగ్స్‌ను అందించిన లిరిసిస్ట్ కన్నుమూయడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.