పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌కు దిల్లీ కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా... పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ క్రమంలోనే 'ఆదిపురుష్' మూవీటీమ్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా 'ఆదిపురుష్' సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోరింది. తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు హీరో ప్రభాస్‌తో పాటు 'ఆదిపురుష్' మూవీటీమ్‌కు సైతం నోటీసులు జారీ చేసింది.