project k san diego Deepika padukone : పాన్ ఇండియా ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె'. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను.. ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజుల నుంచి మూవీటీమ్ వరుసగా సర్ప్రైజ్లు ఇస్తోంది.
అయితే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. కానీ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకొణె మాత్రం.. ఈ ఈవెంట్‌కు హాజరు కావట్లేదు. అయితే దీని వెనక ఓ బలమైన కారణమే ఉందని తెలిసింది.
అదేంటంటే.. ప్రస్తుతం హాలీవుడ్లో యాక్టర్స్ సమ్మె జరుగుతోంది. షూటింగ్స్ అన్నింటినీ మధ్యలోనే నిలిపివేసి.. ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమ్మె.. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఫెడరేషన్లో దీపిక పదుకొణె కూడా ఓ సభ్యురాలే.
అయితే ఈ నిరసనలలో పాల్గొన్న సభ్యులంతా అలాగే ఫెడరేషన్‌లోని సభ్యులంతా.. ఎటువంటి షూటింగ్లలోనూ, అలాగే సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదు. అందుకే దీపిక.. ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ కోసం.. శాన్ డీగో కామిక్ ఈవెంట్‌కు వెళ్లడం లేదు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు తెలిపినట్లు ఇంగ్లీష్ మీడియా సంస్థలు ప్రచురిస్తున్నాయి.ఇకపోతే ఈ సమ్మెకు.. బాలీవుడ్ భామ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా మద్దతు తెలుపుతోంది.