తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆమె లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదేమో!: దీపికా పదుకొణె

ఓ ప్రముఖ ఆంగ్ల సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత గురించి నటి దీపికా పదుకొనె మాట్లాడారు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న మానసిక అనారోగ్యం గురించి తెలుపుతూ.. ఆ సవాలును ఎలా అధిగమించారన్న విషయాన్ని దీపిక ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

deepika about mental illness
deepika padukone

By

Published : Oct 9, 2022, 1:25 PM IST

Updated : Oct 9, 2022, 1:45 PM IST

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నటీమణుల్లో మేటిగా నిలుస్తున్నారు దీపికా పదుకొనె. అక్టోబర్​ 10న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. తాను ఎదుర్కొన్న మానసిక అనారోగ్యం గురించి వెల్లడించారు. "మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు.. మన కుటుంబ పాత్ర చాలా ముఖ్యమైంది. నా వ్యక్తిగత ప్రయాణంలోనూ మా అమ్మ ఎప్పుడూ నాకు తోడుగా ఉంది" అని దీపికా అన్నారు.

"మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో సంరక్షకులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నా విషయాన్నే ఉదాహరణగా తీసుకోండి. నా మనసు బాగోలేదని మా అమ్మ గుర్తించకపోతే నేను ఏమై ఉండేదాన్నో. ఆమె గుర్తించడం వల్లే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాను. క్రమం తప్పకుండా వాళ్ల సలహాలు పాటించి చికిత్స తీసుకున్నాను".

-- దీపికా పదుకొనె, బాలీవుడ్​ నటి

"నేను బెంగుళూర్‌లో ఉంటున్న సమయంలో నా తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా నా పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు చూపించే యత్నం చేసేదాన్ని. కానీ, ఒక రోజు మా అమ్మ నన్ను నిలదీసి అడిగింది. నీకు ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. 'ఏమైంది ఎందుకలా ఉంటున్నావు?' అని అడిగింది. అప్పుడు నా పరిస్థితి మొత్తం ఆమెకు వివరించాను. నాకు ఆ సమయంలో మా అమ్మను ఆ దేవుడే పంపాడనిపించింది" అని దీపికా తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2015లో తొలిసారి దీపికా తన మానసిక ఇబ్బంది గురించి బాహ్యప్రపంచానికి వెల్లడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'లివ్‌ లవ్‌ లాఫ్‌' కమ్యూనిటీతో కలిసి మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న వారికి సాయం చేస్తోంది.

Last Updated : Oct 9, 2022, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details