రెబల్‌స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో కథనాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలో దీపికా అస్వస్థతకు గురైందని.. హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని సమాచారం.
దీపికకు అస్వస్థత.. 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ నుంచి హడావుడిగా ఆసుపత్రికి! - ప్రాజెక్ట్ కే
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె అస్వస్థతకు గురైందట. 'ప్రాజెక్ట్ కే' షూటింగ్లో ఉన్న సమయంలో హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిందని.. ఈ క్రమంలో ఆమెను ఆసుపత్రికి కూడా తరలించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
దీపికా పదుకొణె
అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దీపికా ప్రస్తుతం కోలుకుంటోందని సినీ వర్గాలు వెల్లడించాయి. షూటింగ్లో కూడా పాల్గొంటోందని తెలిపాయి. విశ్రాంతి లేకపోవడం వల్లే ఆమెకు ఇలా జరిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఈ విషయంపై దీపికా ప్రతినిధులు లేదా మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి :అత్యాచారాలకు పబ్స్ కారణం కాదు.. చూసే విధానంలోనే: సోనూసూద్
Last Updated : Jun 14, 2022, 5:46 PM IST