తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ ప్రాజెక్ట్​లో చెర్రీ-త్రిష​.. సస్పెన్స్​​ క్రియేట్​ చేస్తున్న రణ్​వీర్​ సింగ్​.. - త్రిష లేటెస్ట్ న్యూస్

Ranveer Singh Secret : సౌత్​ ఇండస్ట్రీలో సెన్సేషన్​ క్రియేట్​ చేస్తున్న రామ్​ చరణ్​, త్రిష ఇటీవలే ఒకే స్క్రీన్​పై మెరిశారు. ఆ వీడియోలో బాలీవుడ్​ కపుల్​ దీపికా రణ్​వీర్​ కూడా ఉన్నారు. అయితే వీరందరూ కలిసి ఓ సీక్రెట్​ను బయటపెట్టే పనిలో ఉన్నారంట. ఇంతకీ అదేంటంటే..

deepika ranveer
ram charan and trisha

By

Published : Jul 2, 2023, 3:30 PM IST

Updated : Jul 2, 2023, 3:55 PM IST

Ranveer Singh Instagram : బాలీవుడ్​లో స్టార్​ కపుల్​గా మెరుస్తున్నారు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట. ఇక సౌత్​లో సెన్సేషన్స్​ సృష్టిస్తున్నారు త్రిష, రామ్​ చరణ్. ఈ నలుగురు కూడా ఇండస్ట్రీలో టాప్​ మోస్ట్​ యాక్టర్సే. వీరందరూ విడివిడిగా ప్రేక్షకుల మదిలో తమ నటనతో చెరగని ముద్ర వేసిన వారే. కానీ ఈ స్టార్స్​ ఒకే వేదికపై కనిపించి కనువిందు చేయడం అరుదు. అయితే తాజాగా ఈ తారలు​ ఓ ప్రాజెక్ట్​ కోసం ఒకే స్క్రీన్​పై మెరిసి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. నెట్టింట హల్​చల్​ చేస్తున్న ఓ గ్లింప్స్ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ అదేంటంటే..​

బాలీవుడ్​ స్టార్​ రణ్​వీర్​ సింగ్ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ పోస్ట్​ షేర్​ చేశారు.​ ఈ వీడియో మొదట్లో దీపికా తన తప్పిపోయిన భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ కనిపిస్తారు. ఆ తర్వాత షాట్‌లో రణవీర్ సింగ్​ 'టార్గెట్​ ఫౌండ్'​ అంటూ ఎవరికో ఇన్​ఫర్మేషన్​ ఇస్తారు. వెనువెంటనే రామ్ చరణ్ ఛేజింగ్‌ సీన్​, పోలీస్ స్టేషన్‌లో బాధతో నిల్చున్న త్రిష.. ఇలా నాలుగు ఆసక్తికరమైన షాట్లతో గ్లింప్స్ మొత్తం సస్పెన్స్​గా సాగుతుంది. మధ్య మధ్యలో 'కొన్ని సీక్రెట్స్​.. సీక్రెట్స్​గానే ఉండిపోవాలి', 'కొన్ని పశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతేనే మంచిది', 'కొన్ని రహస్యాలను పరిష్కరించకుండా వదిలేయడమే మంచిది'. అనే కోట్స్​ ఆడియెన్స్​లో మరింత సస్పెన్స్​ను క్రియేట్​ చేసేలా ఉంటాయి.

మరోవైపు రణ్​వీర్​ సింగ్ తన​ పోస్ట్​ కింద 'రహస్యం త్వరలో బయటపడుతుంది! బిగ్​ రివీల్​ కోసం వేచి ఉండండి' అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో ఈ వీడియోపై ఆసక్తి ఎక్కువైపోంది. ఇప్పటికే ఈ స్టార్స్​ అందరూ దేని కోసం ఈ వీడియోలో కనిపంచారంటూ ఫ్యాన్స్ కన్​ఫ్యూజన్​లో పడిపోగా.. ఇప్పుడు ఈ క్యాప్షన్​​ నెటిజన్లను మరింత ఆలోచింపజేసేలా చేస్తోంది.

ఈ క్రమంలో నెట్టింట కొందరేమో ఇదంతా ఓ కొత్త సిరీస్​ లేదా సినిమా ప్రమోషన్స్​లో భాగమని అంటుండగా.. మరికొందరేమో ఇది పక్కా ఏదో యాడ్​ షూట్ అయ్యుండచ్చని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం ఆ 'బిగ్​ సీక్రెట్​ రివీల్'​ అయితే కానీ తెలియదని ఇంకొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Jul 2, 2023, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details