Deepavali 2023 Movie Release : టాలీవుడ్లో పండగ సీజన్ అంటే.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ క్యూ కట్టేస్తారు. తమ చిత్రాలతో అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్ని అలరించేందుకురెడీ అయిపోతుంటారు. పైసా వసూలు చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే ఎందుకో మరి ఈ సారి రెండు పండగ సీజన్లను, అలానే లాంగ్ వీకెండ్లను మిస్ చేసేశారు మన దర్శకనిర్మాతలు.
ఇటీవలే వినాయక చవితి వచ్చింది. కానీ ఒక్క సరైన తెలుగు చిత్రం కూడా ఈ పండగ బరిలో దిగలేదు. కేవలం డబ్బింగ్ చిత్రాలే వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే అది తమిళంలోనే మంచి టాక్ దక్కించుకుంది. కానీ తెలుగులో అంతగా రాణించలేకపోయింది. దీంతో తెలుగు చిత్రసీమకు గణేశుడి సెలవులు వృథా అయిపోయాయనే చెప్పాలి.
అయితే తర్వాత రాబోయే దసరా మాత్రం అలా లేదు. ప్రేక్షకుల్ని అలరించేందుకు బాలకృష్ణ భగవంత్ కేసరి, మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు రెడీ అయిపోతున్నాయి. కాబట్టి నో టెన్షన్. బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల సందడి ఉంటుంది. కానీ దీపావళికే మళ్లీ సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. టాపసుల పండగకు డబ్బింగ్ జాతరే కనిపించే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 10న టాలీవుడ్ నుంచి కేవలం మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'(Adikesava Release Date) ఒక్కటే రిలీజ్ కానుంది. కానీ అప్పుడే కార్తీ జపాన్, లారెన్స్-ఎస్జే సూర్య కాంబో జిగర్తాండ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే చియాన్ విక్రమ్ - గౌతమ్ మేనన్ ధృవ నచ్చతీరం కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట.