తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దివంగత నటుడి ఇంట్లో ఆస్తి వివాదం.. కోర్టు మెట్లెక్కిన కుమార్తెలు - shivaji ganeshan property issue

దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశన్​ కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన ప్రభు, రామ్​కుమార్​పై ఆరోపించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

Daughters of late actor Sivaji Ganesan have filed civil suit accusing their brothers Ramkumar and Prabhu
తండ్రి శివాజీ గణేశన్​తో ప్రభు, రామ్​కుమార్

By

Published : Jul 8, 2022, 7:36 AM IST

Updated : Jul 8, 2022, 8:46 AM IST

Shivaji Ganeshan Property Issue: తండ్రి ఆస్తిలో తమకు భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన నటుడు ప్రభు, రామ్‌కుమార్​పై ఆరోపణలు చేస్తూ శివాజీ గణేశన్‌ కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశన్​కు కుమారులు ప్రభు, రామ్‌కుమార్​, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తమకు తెలియకుండా ఆస్తులను విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలన్నారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్‌కుమార్ అపహరించారని, శాంతి థియేటర్​లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాలను వారిద్దరి పేరిటకు మార్చుకున్నట్లు ఆరోపించారు. శివాజీ గణేశన్ రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్‌ పవర్ ఆఫ్‌ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్​ల కుమారులు విక్రమ్‌ ప్రభు, దుశ్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

Last Updated : Jul 8, 2022, 8:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details