నేచురల్ స్టార్ నానీ నటించిన పాన్ ఇండియా సినిమా 'దసరా'. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం టాక్ వచ్చేసింది. 'దసరా' ప్రీమియర్ షోలు చూసిన.. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.
ఈ సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. ఇంటర్వెల్ పార్ట్ అదిరిపోయిందని చెబుతున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. వాటిని ఎలివేట్ చేసిందని అంటున్నారు. ఇక, డైరెక్టర్.. అన్ని తెలుగు సినిమాల లానే.. టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకునే హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడని.. స్టోరీ లైన్ కూడా బాగుందని చెబుతున్నారు. కాగా, రూ.5 కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన భారీ క్లైమాక్స్.. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడుతున్నారు. నాని, కీర్తి సురేష్ మధ్య ఎమోషన్ సీన్స్, పతాక సన్నివేశాల్లో వచ్చే ఫైట్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. అయితే, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉన్నాయని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాని నట విశ్వరూపం.. క్లైమాక్స్ అదుర్స్.. 'దసరా' ట్విట్టర్ రివ్యూ - nani remuneration for dasara
నేచురల్ స్టార్ నానీ నటించిన పాన్ ఇండియా సినిమా 'దసరా'. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం టాక్ వచ్చేసింది. 'దసరా' ప్రీమియర్ షోలు చూసిన.. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.
కాగా, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో.. వరల్డ్‌వైడ్‌గా 3 వేలకు పైగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పటివరకు అతి తక్కువ సినిమాలు మాత్రమే 3 వేలు.. అంతకన్నా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. 'బాహుబలి-1', 'బాహుబలి-2' , 'సైరా', 'సాహో', 'రాధేశ్యామ్', 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'లైగర్'.. ఇప్పటివరకూ అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన తెలుగు చిత్రాలుగా రికార్డుకెక్కాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నాని సినిమా కూడా చేరింది.ఇదివరకు లవర్ బాయ్‌గా, బాయ్ నెక్స్ట్ డోర్గా కనిపించిన నాని.. ఈ సినిమాలో ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్‌లో రగ్డ్గా కనిపించారు. కీర్తి సురేశ్, నాని జంట మరోసారి హిట్‌టాక్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో సముద్ర ఖని, దీక్షిత్ శెట్టి, శైన్ టాక్ చాకో, సాయి కుమార్, శమ్మ కాసిం, సజోల్ చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్‌గా సత్యం సూర్యం వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. నవిన్ నూలి ఎడిటింగ్ చేశారు. కాగా. ఈ చిత్రానికి నాని రూ.15 కోట్లు, కథానాయిక కీర్తి సురేశ్ రూ.2 కోట్ల వరకు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నాని రూ.12 కోట్లు వరకు తీసుకునేవారట. అయితే, ఇందులో నిజమెంతో తెలియదు.