తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు ముగిశాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మద్దతుదారు దామోదర ప్రసాద్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి జెమిని కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా, దామోదరప్రసాద్కు 339 ఓట్లు, జెమిని కిరణ్ 315 ఓట్లు వచ్చాయి. ఇక, వైస్ ప్రెసిడెంట్లుగా వై సుప్రియ, కె అశోక్ కూమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు.. ప్రముఖ నిర్మాత, డైరెక్టర్, రాఘవేంద్ర రావు, దిల్ రాజు, నిర్మాత సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీగా ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి ఎన్నికవగా.. జాయింట్ సెక్రటరీగా నట్టి కుమార్, భరత్ చౌదరి ఎన్నికయ్యారు. కోశాధికారిగా టి రామ సత్యనారాయణ గెలిచారు. వీరితో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం 2025 వరకు ఉంటుంది.
దిల్‌రాజు చేతికి నిర్మాతల మండలి!.. కొత్త అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ - తెలుగు చలని చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి ఆదివారం జరిగిన ఎన్నికలు ముగిశాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతుదారు మండిలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు..
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు :
- దిల్ రాజు
- డి.వి.వి దానయ్య
- పి.వి రవికిశోర్
- రవిశంకర్ యలమంచిలి
- ఎన్. పద్మిని
- బి. వేణుగోపాల్
- వై. సురేందర్ రెడ్డి
- గోపీనాథ్ ఆచంట
- ఠాగూర్ మధు
- కేశవరావు పల్లి
- శ్రీనివాసరావు వజ్జ
- అభిషేక్ అగర్వాల్
- కృష్ణ తోట
- రామకృష్ణ గౌడ్ ప్రతాని
- పూసల కిశోర్
కాగా, నిర్మాతల మండలికి షెడ్యూల్ ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎలక్షన్స్ నిర్వహించాలి. కానీ, కొవిడ్ కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దీంతో నిర్మాతలంతా ఎన్నికలు జరపాల్సిందేనని ఆందోళన చేశారు. దీని కారణంగా ఆదివారం నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల్లో పాల్గొన్న పలువురు నిర్మాతలు నందమూరి తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ఇక, ఎలక్షన్లు ప్రారంభమైపోయినందున ఆపలేకపోయామని.. తారకరత్న కుటుంబ సభ్యులకు నిర్మాత సి కళ్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు.