తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అక్కినేని ఫ్యామిలీకి అచ్చిరాని ఇంగ్లీష్ టైటిల్స్​.. మాకొద్దు బాబోయ్​ అంటున్న ఫ్యాన్స్​!

తాజాగా వచ్చిన చైతూ 'కస్టడీ' సినిమా మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. అయితే ఇక్కడ అభిమానులు ఓ సంగతి గమనించారు. అక్కినేని ఫ్యామిలీకి కొన్ని ఇంగ్లీష్​ టైటిల్స్​ అంతగా అచ్చి రావట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగార్జున, అఖిల్​ నటించిన ఇంగ్లీష్ టైటిల్స్​ ఉన్న ఓల్డ్​ మూవీ టైటిల్స్​ను అలాగే వాటి రిజల్ట్​ను ప్రస్తావిస్తూ పోస్ట్​లు పెడుతున్నారు.

Akkineni Family English titles
అక్కినేని ఫ్యామిలీకి అచ్చిరాని ఇంగ్లీష్ టైటిల్స్​.. మాకొద్దు బాబోయ్​ అంటూ ఫ్యాన్స్​!

By

Published : May 13, 2023, 2:52 PM IST

Akkineni Family English titles : ఓ వ్యక్తికి పేరు ఎంత ముఖ్యమో.. సినిమాకు టైటిల్‌ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమాపై అంచనా, ఆసక్తి పెంచేందుకు.. అలాగే దానిపై బజ్​ క్రియేట్​ చేసే విషయంలో అవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలా అని నచ్చిన టైటిల్​ను పెట్టుకుంటే సరిపోదు. అది కథకు తగ్గట్టుగా ఉండాలి. లేదంటే ఇక అంతే సంగతి. అయితే ఈ టైటిల్స్​లోనూ చిన్నది, పెద్దది, ప్రాంతీయ భాషలో, ఇంగ్లీష్​లో​.. ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటిన్నంటిని కథకు సరిపోయేలా.. సెంటిమెంట్స్​ను ఫాలో అవుతూ పెడుతుంటారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాలు టైటిల్స్​తో దూసుకెళ్తే.. మరికొన్ని సినిమాలు అదే టైటిల్స్​తో నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా గమనిస్తే కొన్ని ఇంగ్లీష్​ టైటిల్స్​.. అక్కినేని కుటుంబానికి దాదాపుగా కలిసి వచ్చినట్టుగా కనిపించట్లేదు.

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'కస్టడీ' సినిమా మిక్స్​డ్​ టాక్​తో బాక్సాఫీస్​ ముందు యావరేజ్​గా నిలిచింది. కలెక్షన్స్ విషయానికొస్తే మరీ దారుణంగా రూ.3 నుంచి రూ.4కోట్ల వరకే వచ్చాయని టాక్​. ఇక తమిళంలో ఇరవై లక్షలు కూడా అందుకోలేదని సమచారం. ఇదిలా ఉండగా అయితే గతేడాది విడుదలైన చైతూ 'థ్యాంక్యూ' కూడా ఇంగ్లీష్​ టైటిలే. ఆయన ఫస్ట్ సినిమా టైటిల్​ 'జోష్​' కూడా ఆంగ్ల పదమే. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్​ ముందు నిరాశపరిచినవే.

Akkineni Akhil Movies : మరోవైపు అక్కినేని నట వారసుడు అఖిల్.. లేటెస్ట్​గా 'ఏజెంట్' అనే భారీ బడ్జెట్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇది కూడా రెండేళ్ల పాటు భారీ అంచనాలతో ఊరించి మరీ వచ్చి అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. కనీస వసూళ్లను కూడా అందుకోలేక బాక్సాఫీస్​ ముందు చతికిలపడింది.

Nagarjuna Movie English Titles : ఇక నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్', 'ది ఘోస్ట్', 'ఆఫీసర్' సినిమా పేర్లు కూడా చూస్తే హాలీవుడ్​ రేంజ్​లో స్టైల్​గా ఉంటాయి. కానీ ఈ సినిమాలన్నింటి మాత్రం ఒక్కటే. ఏం మార్పు లేదు. కనీసం యావరేజ్​గా కూడా ఆడలేదు. అన్నీ నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ పెట్టుకున్న అచ్చమైన తెలుగు పేర్లు 'బంగార్రాజు', 'మజిలీ', 'మనం', 'శివ', 'ఏం మాయ చేశావే', 'సిసింద్రీ' .. ఇంకా ఎన్నో చిత్రాలు సూపర్ హిట్​గా నిలిచాయి. అయితే ఇక్కడ అఖిల్​ నటించిన ఇంగ్లీష్ టైటిల్ ఉన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రం పర్వాలేదనిపించింది.

Naga chaitanya movie English titles : చైతూ నటించిన 'కస్టడీ'కి.. టైటిల్​ విషయంలో అభిమానులు ఓ పేరును సూచిస్తున్నారు. సినిమాలో హీరో పోషించిన కానిస్టేబుల్ పాత్ర పేరు 'శివ' అని పెట్టి ఉంటే.. కనీసం ఫస్ట్​ రోజు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్​ థియేటర్లకు వచ్చేవారని అంటున్నారు. అలాగే ఓపెనింగ్స్​ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేవని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. మంచి కథలతో పాటు టైటిల్స్ విషయంలోనూ మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:టాలీవుడ్​ హీరోస్​కు తమిళ డైరెక్టర్స్​ షాకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details