తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' ట్రైలర్​.. మీరు చూశారా? - నాగ చైతన్య కస్టడీ సినిమా

Custody Movie Trailer : యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా ట్రైలర్​ విడుదలయ్యింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి.

custody movie trailer telugu
custody movie trailer telugu

By

Published : May 5, 2023, 4:01 PM IST

Updated : May 5, 2023, 5:37 PM IST

Custody Movie Trailer : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య.. నటించిన కొత్త చిత్రం 'కస్టడీ'. ఇందులో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. అభిమానులు ఊహించినట్లే ఈ కస్టడీ ట్రైలర్​ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్​ ఎంతగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటికి మించేలా ట్రైలర్​​ను బాగా రెడీ చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. 2.25 నిమిషాల పాటు ఉన్న ఈ ప్రచార చిత్రంలో చైతూ ఇంటెన్స్ లుక్​లో కనిపించి.. పవర్ ఫుల్ డైలాగ్స్​తో అదరగొట్టారు.

హీరో నాగ చైతన్య.. శివ అనే కానిస్టేబుల్ పాత్రలో నంటించాడు. తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. చైతూ సరసన రేవతి పాత్రలో కృతి శెట్టి ఆడిపాడింది. ఈ సినిమాలో కృతి శెట్టికి మంచి స్కోప్​ ఉన్న పాత్ర చేసినట్లు కనిపిస్తోంది. శివ పనిచేస్తున్న పోలీస్​ స్టేషన్‌ లాకప్‌లో ఉన్న క్రిమినల్ అరవింద్ స్వామిని.. కోర్టులో హాజరుపరచడానికి అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. ఈ క్రమంలో కానిస్టేబుల్​ శివ ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? చివరకు అరవింద్​ స్వామిని కోర్టులో హాజరుపరిచాడా? లేదా అన్నది సినిమా కథాంశం. ఈ చిత్రంలో సీనియర్​ హీరోయిన్ ప్రియమణి కూడా పవర్​ ఫుల్​ పాత్రలో నటించించారు. 'న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది', 'నిజం గెలవడానికి లేట్ అవుతుంది. కానీ కచ్చితంగా గెలుస్తుంది' అనే పవర్​ఫుల్​ డైలాగులతో నాగ చైతన్య ఆకట్టుకున్నారు.

ఇక కస్టడీ సినిమా విషయానికొస్తే.. శరత్ కుమార్​లు విలన్స్​గా కనిపించారు. 'థ్యాంక్యూ' సినిమా బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టిన తర్వాత చైతూ కూడా ఈ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. అలాగే వరుస పరాజయాలను అందుకుంటున్న కృతి కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రానికి 'మ్యూజిక్ మ్యాస్ట్రో' ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. నాగ చైతన్య డైలాగ్స్​కు ఈ మ్యూజికే ప్రాణం పోసిందని చెప్పాలి. స్క్రీన్​పై కనిపించే ప్రతి సన్నివేశాన్ని.. ఈ మ్యూజికే హైలైట్​ చేసింది. ఆడియెన్స్​లో గూస్​బంప్స్​ తెప్పించింది. మొత్తంగా ఈ ట్రైలర్​ చిత్రం అక్కినేని అభిమానులకు తెగ ఆకట్టుకుంటుంది.

Last Updated : May 5, 2023, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details