Curry And Cyanide Documentary :దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాలీ జోషెఫ్ కేసు ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు సృష్టింస్తోంది. ఇటీవల విడుదలైన 'కర్రీ అండ్ సైనైడ్ : ది జాలీ జోసెఫ్ కేస్' అనే డాక్యుమెంటరీ భాషతో సంబంధం లేకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. క్రిస్టో టామీ దీనికి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రెండు వారాల పాటు గ్లోబల్ టాప్-10 స్ట్రీమింగ్ కంటెంట్లలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గంటన్నర నిడివి గల 'కర్రీ అండ్ సైనైడ్' తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Jolly Joseph Case Details :కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్ జాలీ జోసెఫ్‌కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్‌ను ఆహారంలో సైనైడ్ పెట్టి చంపేసింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని తన ప్రియుడి భార్య, ఆమె కూతురుకి సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. అలా ఎవరికీ అనుమానం రాకుండా 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసింది. 2002లో తన అత్తను మొదట హత్య చేసిన జాలీ, 2016లో చివరి హత్య చేసింది. ప్రతి హత్యకు మధ్య కొంతకాలం గ్యాప్ తీసుకుంది.