Aadi Crazy Fellow Pre Release Event: ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రం 'క్రేజీ ఫెలో'. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమాని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నటుడు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
వేడుకనుద్దేశించి శర్వానంద్ మాట్లాడుతూ.. "సాయికుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన తనయుడు ఆది నాకు తమ్ముడులాంటివాడు. ఆది విజయం అందుకుంటే ఆనందపడే వ్యక్తుల్లో ముందు నేనుంటా. 'క్రేజీ ఫెలో'ని చూస్తుంటే ‘రన్ రాజా రన్’ ఫ్లేవర్ కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని శర్వానంద్ అన్నారు.