తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​పై నయనతార కామెంట్స్​.. డార్లింగ్​ అలాంటోడంటూ.. - ప్రభాస్ నయతార సినిమా

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​పై కామెంట్స్​ చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏం చెప్పిందంటే..

Nayantara comments on prabhas
ప్రభాస్​పై నయనతార కామెంట్స్​.. డార్లింగ్​ అలాంటోడంటూ..

By

Published : Dec 21, 2022, 4:01 PM IST

స్టార్ హీరో ప్రభాస్​కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్‌ బేస్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సామాన్యులే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే. ​ఎందుకంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. తన తోటి నటులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఇప్పుడు తాజాగా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. డార్లింగ్​పై ప్రశంసలు కురిపించింది లేడీ సూపర్​ స్టార్ నయనతార.

ఆమె తాజా చిత్రం కనెక్ట్‌ ప్రమోషన్లలో పాల్గొన్న నయనతార.. ప్రభాస్‌ ఎలాంటి వ్యక్తో చెప్పారు. ప్రభాస్‌ది చిన్న పిల్లల మనస్తత్వం అని, ఆయన పాన్​ ఇండియా స్టార్‌గా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యాంకర్‌ సుమ చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"ప్రభాస్‌ ఎంతో మంచి వాడు. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదో నాకు తెలీదు. నేను అతడితో పని చేసినప్పుడు మాత్రం అచ్చం చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించేవాడు. అక్కడికీ ఇక్కడికీ గెంతేవాడు. జోకులు వేసేవాడు. అతడితో ఉండటం సరదాగా ఉండేది. సెట్‌లో చిన్నపిల్లాడిలాగా ఎప్పుడూ ఎగురుతూ, దూకుతూ ఉండేవాడు. కానీ, ఇప్పుడు ప్రభాస్‌ చాలా పెద్ద స్టార్‌ అయిపోయాడు. అతడ్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

కాగా, నయనతార నటించిన కనెక్ట్‌ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించా. రౌడీ పిక్షర్స్‌ బ్యానర్‌పై విఘ్నేష్‌ శివన్‌ ఈ సినిమాను నిర్మించారు. నయనతారతో పాటు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌లు ప్రధాన పాత్రలో నటించారు.

ఇదీ చూడండి:హీరో నాగార్జునకు షాక్.. గోవాలో 'అక్రమ' నిర్మాణ పనులు ఆపాలంటూ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details