తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​వీర్​ సింగ్​కు ముంబయి పోలీసుల సమన్లు.. ఆగస్టు 22లోగా! - Ranveer Singh summoned

Ranveer Singh Photoshoot: ఇటీవల న్యూడ్​ ఫొటోషూట్​తో వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ను ముంబయి పోలీసులు విచారించనున్నారు. ఆగస్టు 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

Mumbai police to question Ranveer Singh in nude photoshoot case
Mumbai police to question Ranveer Singh in nude photoshoot case

By

Published : Aug 12, 2022, 10:42 PM IST

Ranveer Singh Photoshoot: బాలీవుడ్ స్టార్​ రణ్​వీర్​ సింగ్​ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు ముంబయి పోలీసులు. ఇటీవల రణ్​వీర్​ న్యూడ్​ ఫొటోషూట్​పై కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. సమన్లు జారీ చేసేందుకు ముంబయి పోలీసులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. కానీ రణ్​వీర్​ ప్రస్తుతం ముంబయిలో లేని కారణంగా నోటీసులు అందించడం సాధ్యం కాలేదు. ఆగస్టు 16న తిరిగివస్తానని రణ్​వీర్​ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ పోలీసులు వెళ్లి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 22న స్టేట్​మెంట్​ నమోదు చేసేందుకు ఆయనను పిలుస్తామని స్పష్టం చేశారు.

ఇటీవలే పోస్ట్​ చేసిన న్యూడ్​ ఫొటోషూట్​ ప్రస్తుతం చిత్రసీమలో హాట్​ టాపిక్​గా మారింది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్​గా మారాయి. అయితే ఇది వివాదస్పదమైంది. రణ్​వీర్​ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు.

రణ్​వీర్​ సింగ్​ న్యూడ్​ ఫొటోషూట్​

ఈ నేపథ్యంలోనే జులై 26న ముంబయిలోని చెంబూర్​ పోలీస్​ స్టేషన్​లో రణ్​వీర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. ఓ ఎన్​జీఓ సంస్థ ఈ కంప్లైంట్​ ఇచ్చింది. రణ్​వీర్..​ మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు రిజిస్టర్​ చేయాలని డిమాండ్​ చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్​ దీపికా పదుకోణె.. 'ప్రాజెక్ట్ K', 'పఠాన్​' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: కదలలేని స్థితిలో కైకాల.. బైడ్​పైనే కేక్​ కట్​ చేయించిన చిరు

ABOUT THE AUTHOR

...view details