తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ కమెడియన్​కు గుండెపోటు.. వర్కౌట్స్​ చేస్తూ ఒక్కసారిగా.. - राजू श्रीवास्तव को पड़ा दिल का दौड़ा

Comedian Raju Srivastava Heart Attack: ప్రముఖ కమెడియన్​ రాజు శ్రీవాస్తవ అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన జిమ్​లో వర్కౌట్లు చేస్తుండగా ఒక్కసారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

Comedian Raju Srivastava Heart Attack
కమెడియన్​ రాజు శ్రీవాస్తవకు గుండెపోటు

By

Published : Aug 10, 2022, 2:52 PM IST

Updated : Aug 10, 2022, 3:42 PM IST

Comedian Raju Srivastava Heart Attack: ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు అకస్మాతుగా ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయారట. వెంటనే ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసియూలోనే ఉన్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు.. రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ మధ్యలో కాలంలో పలువురు నటులు జిమ్​లో కసరత్తులు చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు.

Last Updated : Aug 10, 2022, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details