తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైతూపై సామ్​ షాకింగ్ కామెంట్స్​.. 'ఒకే రూమ్​లో ఉంటే కత్తులతో..' - సమంత కాఫీ విత్ కరణ్​

Coffee with karan Samantha: 'కాఫీ విత్ కరణ్'​ షోలో సందడి చేసిన హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయమై స్పందించింది. తనపై వచ్చిన రూమర్స్​? డివర్స్ తర్వాత తన జీవితం ఎలా ఉంది? వంటి విషయాల గురించి మాట్లాడింది. ఆ సంగతులు..

Coffee with karan Samantha
కాఫీ విత్ కరణ్​ సమంత

By

Published : Jul 22, 2022, 7:52 AM IST

Updated : Jul 22, 2022, 10:07 AM IST

Coffee with karan Samantha: విడాకుల తర్వాత జీవితం కష్టంగా మారిందని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని చెప్పింది హీరోయిన్ సమంత. మునుపటి కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్​గా ఉన్నట్లు తెలిపింది. 'కాఫీ విత్​ కరణ్​ షో'లో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​తో సందడి చేసిన సామ్​.. 'నాగచైతన్యతో విడిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది?' అని వ్యాఖ్యాత కరణ్​ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పింది. అంతేకాకుండా కరణ్​ ఓ ప్రశ్న అడుగుతోన్న సమయంలో.. "నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?" అని కరణ్‌ అడగ్గా.. 'భర్త కాదు మాజీ భర్త' అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. దీనికి కరణ్‌.. క్షమాపణలు కూడా చెప్పి ఇంటర్వ్యూ కొనసాగించారు.

"మేమిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదు. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డా. మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదు. ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదు. మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్‌ ప్రచారం జరిగింది. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు. నేను ఓపెన్‌గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా. మేము విడిపోయిన కొన్నిరోజులకే 'ఊ అంటావా' సాంగ్‌ ఆఫర్‌ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్‌ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, నాలాంటి స్టార్‌ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించా" అని సామ్‌ తెలిపారు.

అనంతరం, తాను భరణం కింద రూ.250 కోట్లు తీసుకున్నానని జరిగిన ప్రచారంపై సామ్‌ స్పందించారు. "సోషల్‌మీడియాలో నాపై ఎన్నో పుకార్లు, ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద రూ.250 కోట్లు నేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని చూసి మొదట షాక్‌ అయ్యాను. ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని" అని ఆమె వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.

కాగా, 2009లో 'ఏ మాయ చేసావే' సినిమా ద్వారా నాగ చైతన్యతో సమంతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 2017 అక్టోబర్ 6న చైతూ-సామ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. గతేడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులను షాక్​కు గురి చేసింది.

ఇదీ చూడండి:Tollywood: ఈ వారసురాళ్లు యమా స్పీడు.. నిర్మాణంలో జోరు

Last Updated : Jul 22, 2022, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details