తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త సినిమాల ట్రైలర్లు వచ్చేశాయి.. మీరు చూశారా? - సినిమా వార్తలు

టాలీవుడ్​ యువ నటుడు కిరణ్​ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ట్రైలర్​ను చిత్ర యూనిట్​ విడుదల చేసింది. బాలీవుడ్​ 'విక్రం వేద' టైలర్​ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. నాగశౌర్య కొత్త చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్​ కూడా విడుదలైంది. ప్రముఖ తమిళ నటుడు 42వ సినిమా అప్డేట్ వచ్చేసింది.

Cinema Updates
Cinema Updates

By

Published : Sep 8, 2022, 11:03 PM IST

'నీ కూతురు ప్రేమించినవాడిని కదా.. నన్ను మెతక అనుకుంటున్నావేమో.. కాస్ట్యూమ్‌, కళ్లజోడు చూస్తే అర్థంకావట్లేదా? మాస్‌.. ఊర మాస్‌' అంటూ తనకు కాబోయే మావయ్యకు వార్నింగ్‌ ఇచ్చారు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంలోని సంభాషణ ఇది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్​ ఈ నెల 16 ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కూతురు పుడితే కొందరు తండ్రులు ఎందుకు ఆనందంగా ఉంటారో వివరించే సన్నివేశంతో ప్రారంభమైంది ట్రైలర్‌. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. డ్రైవర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ల ప్రేమకథ ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది.

'మగతనం అంటే మామూలుగా ఉన్న అమ్మాయితో మంచిగా ఉండటం కాదు తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్‌ బిహేవ్‌ చేయకుండా ఉండటం', 'అబ్బాయిలు ఇంతగా తాగాలంటే పెద్ద కారణం ఉండాల్సిన అవసరంలేదు. కానీ, ఓ అమ్మాయి ఇంతలా తాగుతుందంటే ఏదో బలమైన కారణమే ఉండాలి' అని కథానాయకుడు చెప్పిన సంభాషణలు యువతను మెప్పించేలా ఉన్నాయి. తమ తమ పాత్రలతో గెటప్‌ శ్రీను, బాబా భాస్కర్‌ నవ్వులు పంచారు. ఈ సినిమాలో కిరణ్‌ సరసన సంజనా ఆనంద్‌, సోనూ ఠాకూర్‌ సందడి చేయనున్నారు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాని దివంగత కోడి రామకృష్ణ తనయ దివ్య నిర్మించారు. మణిశర్మ స్వరాలందించారు.

బావీవుడ్​ 'విక్రమ్​ వేద' ట్రైలర్​ రిలీజ్​..
"ప్రతి కథలో మంచీ చెడూ ఉంటాయి. కానీ, ఇది ఇద్దరు చెడ్డవారి కథ" అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది 'విక్రమ్‌ వేద' చిత్ర బృందం. బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, సైఫ్ అలీఖాన్‌ కలిసి నటించిన సినిమా ఇది. తాజాగా ట్రైలర్‌ విడుదలై, సందడి చేస్తోంది. ఇందులో.. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌, గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌ కనిపించారు. ఇద్దరి నటన కట్టిపడేసేలా ఉంది. హృతిక్‌ రోషన్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాతృకకు దీటుగా ఈ రీమేక్‌ చిత్రం తెరకెక్కిన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం 'విక్రమ్‌ వేద'కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఈ హిందీ సినిమాకూ దర్శకత్వం వహించింది. ఎస్‌. శశికాంత్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. రాధికా ఆప్టే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రిష్ణ వ్రింద విహారి టైలర్​
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. సెప్టెంబర్​ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ట్రైలర్​ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆర్​ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. వెన్నెల కిశోర్​, బ్రహ్మాజీ, రాహుల్​ రామకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్​ స్పరాలందించారు. రొమాంటిక్ కమెడీ ఎంటర్​టైనర్​గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

సూర్య 42 సినిమా అప్డేట్
తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించారు తమిళ నటుడు సూర్య. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ 'జై భీం','ఆకాశం నీ హద్దురా' లాంటి సినిమాలతో పాన్​ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూర్య సినిమా అప్డేట్ రానేవచ్చింది. ప్రముఖ దర్శకుడు సూర్య 42వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కే ఈ జ్ఞానవేల్​ రాజా సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​ బాణీలు అందిస్తున్నాడు.

ఇవీ చదవండి:రోమ్​ వీధుల్లో శ్రియ చక్కర్లు.. 'రాధ'తో ఫొటోషూట్​..

'నా రూటే సపరేటు.. మీకన్నా నేనే ఎక్కువ చిల్ అవుతున్నా..'

ABOUT THE AUTHOR

...view details