తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పండగ వేళ కొత్త సినిమా పోస్టర్ల కళకళ.. కేజీఎఫ్​-2 రికార్డ్​

Movie Updates: తెలుగు సంవత్సరాది వేళ కొత్త సినిమా పోస్టర్లు వచ్చేశాయి. ది వారియర్​, పక్కా కమర్షియల్, ధాత్రి, ఎఫ్3, స్వాతిముత్యం సహా పలు చిత్రాల పోస్టర్లను చూసేయండి.

Cinema Updates
Cinema Updates

By

Published : Apr 2, 2022, 9:39 AM IST

Updated : Apr 2, 2022, 2:28 PM IST

Pakka Commercial Poster: వాయిదా పడుతూ వస్తున్న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' ఎట్టకేలకు జులై 1న థియేటర్లలోకి రానుంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్​గా నటించింది. తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని చిత్రబృందం కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

'పక్కా కమర్షియల్​' కొత్త పోస్టర్​

The Warrior New Poster: యువ కథానాయకుడు రామ్‌ కీలక పాత్రలో తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం 'ది వారియర్‌'. యాక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జులై 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఉగాది సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

'ది వారియర్​' కొత్త పోస్టర్​
వాంటెడ్​ పండుగాడ్​
ధాత్రి
వర ఐపీఎస్​
శాసనసభ
స్వాతిముత్యం
అన్నీ మంచి శకునములే
రామారావు ఆన్​ డ్యూటీ
ఎఫ్​ 3
Mr. బెగ్గర్​
మేల్​ 15-60, ఫిమేల్ ​20-50
రాజమండ్రి రోజ్​​ మిల్క్​

KGF 2 trailer records: కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​ సోషల్​మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. అన్ని భాషల్లో కలిపి 155 మిలియన్లకు పైగా వ్యూస్​ను దక్కించుకుంది. హిందీ(72మిలియన్లు), తెలుగు(30),కన్నడ(24), తమిళం(19), మలయాళం (10) మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Anushka New Movie: అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈనెల 4నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని చిత్ర బృందం.. శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.KGF 2 trailer records: కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​ సోషల్​మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. అన్ని భాషల్లో కలిపి 155 మిలియన్లకు పైగా వ్యూస్​ను దక్కించుకుంది. హిందీ(72మిలియన్లు), తెలుగు(30),కన్నడ(24), తమిళం(19), మలయాళం (10) మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

అనుష్క

Gani Pre Release Event: మెగాహీరో వరుణ్​ తేజ్​ నటించిన 'గని' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్. ఉగాది సందర్భంగా నేడు(శనివారం) వైజాగ్​లో ఈ వేడుక జరగనుంది. బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్​ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఏప్రిల్ 8న సినిమా విడుదలకానుంది.

వరుణ్​ తేజ్​

Adavallu Meeku Johaarlu OTT: యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమైంది. సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనుంది.

శర్వానంద్​, రష్మిక

ఇదీ చదవండి:ఆచార్య డబ్బింగ్​లో రామ్​చరణ్​- లైగర్​ కోసం మైక్​ టైసన్​

Last Updated : Apr 2, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details