సినీ కార్మికుల నిరసన.. షూటింగ్లు బంద్.. కారణం ఇదే! - Cine Workers
14:30 June 21
సినీ కార్మికుల నిరసన.. షూటింగ్లు బంద్.. కారణం ఇదే!
వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు సినీ కార్మికులు. రేపట్నుంచి సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. రేపు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. ఈ మేరకు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు.
వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘ నాయకులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలని డిమాండ్ చేశారు.