తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్రిస్మస్​ స్పెషల్​.. వెంకీ మామ X నాని.. హిట్​ కొట్టేదెవరో? - undefined

దసరా సినిమాతో సూపర్​ హిట్​ అందుకున్న టాలీవుడ్​ స్టార్​ హీరో నాని.. కొత్త చిత్రం షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించి మేకర్స్​ లేటెస్ట్​ అప్డేట్​ ఇచ్చారు. క్రిస్మస్​ సందర్భంగా రిలీజ్​ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వెంకటేశ్​ కొత్త మూవీ కూడా అప్పుడే విడుదల కానుంది.

christmas 2023 nani mrunal thakurs clash with venkatesh saindhav at boxoffice
christmas 2023 nani mrunal thakurs clash with venkatesh saindhav at boxoffice

By

Published : Apr 15, 2023, 8:46 PM IST

ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో సోలీ రిలీజ్​ డేట్​ దొరకడం కష్టమవుతోంది. అందులోనూ పండగల సమయంలో అయితే సోలో రిలీజ్​పై ఆశలు వదులకోవాల్సిందే!. రెండు లేదా మూడు సినిమాలు.. ఫెస్టివల్​ సీజన్​లో బాక్సాఫీస్​ వద్ద పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఏడాది క్రిస్మస్​ బరిలో దిగేందుకు హీరోలు సిద్ధమవుతున్నారు. పాన్​ ఇండియా సినిమాలతో టాలీవుడ్​ హీరోలు విక్టరీ వెంకటేశ్​, నేచురల్​ స్టార్​ నాని పోటీ పడనున్నారు.

ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. కొత్త సినిమాతో బిజీ అయిపోయారు. Nani 30 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతారామం చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మృణాల్​ ఠాకూర్​ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యువ్​ దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం గోవాలో నాని సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన వీడియో చూస్తే.. డాటర్ సెంటిమెంట్ కథలో కీలక అంశం కానుందని అర్థం అవుతోంది. విడుదల తేదీ వెల్లడిస్తూ ఓ స్టిల్ రిలీజ్ చేశారు. అందులోనూ ఓ చిన్నారి ఉంది. ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శనివారం ప్రకటించారు. అయితే డిసెంబర్ 22 శుక్రవారం. వీకెండ్ ఎలాగో ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. డిసెంబర్ 25, సోమవారం క్రిస్మస్ హాలిడే. ఆ రోజు కూడా థియేటర్ల దగ్గర సందడి ఉంది. నాని సినిమా గురువారం విడుదల కానుంది కనుక లాంగ్ వీకెండ్ (ఐదు రోజులు) మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

డిసెంబర్ 22న వెంకీ మామ 'సైంధవ్'
అయితే.. నానికి ఇదేమీ సోలో రిలీజ్ కాదు. క్రిస్మస్​ పోటీలో 'సైంధవ్' సినిమా కూడా ఉంది. విక్టరీ వెంకటేశ్​ నటిస్తున్న 'సైంధవ్' సినిమా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. అదీ పాన్‌ ఇండియా చిత్రమే. యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, 'హిట్' విజయాల తర్వాత యువ దర్శకుడు శైలేష్ కొలను తీస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నానిది క్లాస్ సినిమా, వెంకీ మామది మాస్ సినిమా కావడంతో ఏ సినిమాకు వచ్చే ప్రేక్షకులకు ఆ సినిమాకు వస్తారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. 'హిట్' సినిమాను హీరో నాని ప్రొడ్యూస్ చేశారు. శైలేష్ కొలను 'హిట్ 3'లో ఆయనే హీరో. ఇప్పుడు తన దర్శకుడి సినిమాతోనే నాని పోటీ పడబోతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details