మెగాస్టార్ చిరంజీవి.. తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన్ని స్మరించుకున్నారు. తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. "మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడుదొడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటను ఏర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని స్మరించుకుంటూ" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మెగా ఫ్యామిలీ రేర్ పిక్.. ఫొటో అదిరిందిగా.. - Chrianjeevi recalls his father
మెగాస్టార్ చిరంజీవి.. తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్, సోదరీమణులతో కలిసి తన తల్లీదండ్రులతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని షేర్ చేశారు.
మెగా ఫ్యామిలీ రేర్ పిక్.. ఫొటో అదిరిందిగా..
సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్, సోదరీమణులతో కలిసి తన తల్లీదండ్రులతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఈ సందర్భంగా చిరు అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఈ రేర్ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఇదీ చూడండి:ఈ సీరియల్ ముద్దుగుమ్మ కళ్లతో భలే మాయ చేస్తోందిగా
Last Updated : Dec 24, 2022, 5:35 PM IST