Chorbazaar Success meet: ఆకాశ్ పూరి, గెహన సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'చోర్ బజార్'. ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం సుమారు 550కుపైగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'చోర్‌బజార్' చిత్రంతో మాస్ హీరోగా మెప్పించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు తనకు ఇచ్చారని ఆకాశ్ తెలిపాడు. తన గత చిత్రాల కంటే చోర్‌బజార్ ఎంతో పేరు తీసుకొస్తుందని, అందుకు కారణమైన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్నాడు.
'చోర్‌బజార్'.. ఆ నమ్మకాన్ని ఇచ్చింది: ఆకాశ్ పూరి - ఆకాశ్‌పూరి చోర్‌బజార్
Chorbazaar Success meet: 'చోర్‌బజార్' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది మూవీటీమ్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ఆకాశ్‌పూరి.. తన అనుభవాలను తెలిపారు. ఈ చిత్రంతో మాస్ హీరోగా మెప్పించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు తనకు ఇచ్చారని అన్నాడు.
"ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. మాస్ ఆడియెన్స్ నుంచి మంచి పేరు వచ్చింది. సినిమా కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మూవీ ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చింది." అని ఆకాశ్ అన్నారు. "ఆకాశ్, ప్రొడ్యూసర్, టెక్నిషియన్స్.. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్. మళ్లీ కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటున్నాను" అని దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు."దర్శకుడు జీవన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా తొలి సినిమా ఇదేనని గొప్పగా చెప్పుకుంటాను. జీవితాంతం జీవన్‌కు గుర్తుపెట్టుకుంటాను. ఆకాశ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సురేందర్ సాంగ్స్‌ను బాగా రాశారు. ఈ సినిమా మరింత ఆదరిస్తారని భావిస్తున్నాను." అని జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ అన్నారు.
ఇదీ చూడండి: 'రంగమార్తాండ' రిలీజ్‌కు ప్లాన్.. 'పంచతంత్ర కథలు' సాంగ్