డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న 'చోర్ బజార్' సినిమా కొత్త ట్రైలర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. రిలీజ్కు కొన్ని గంటల మందు.. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ ట్రైలర్‌ను వదలడం గమనార్హం. ట్రైలర్‌లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం కీలకమైన అంశంగా కనిపించింది. డైమండ్ చోరీ నేపథ్యంలో జరిగే చోరులు, పోలీసుల హంగామా ఆకట్టుకొంది. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్ కాగా.. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు.
విక్రాంత్ రోణ ట్రైలర్ చూశారా?
కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన 'విక్రాంత్ రోణ'. సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ భండారి దర్శకుడు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’