Chiyaan Vikram injured : వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు స్టార్ హీరో విక్రమ్. ప్రముఖ తమిళ నటుడైన ఈయన తాజాగా గాయపడ్డారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తంగలాన్' అనే సినిమాలోని పోరాట సన్నివేశాల చిత్రీకరణ రిహార్స్‌లో ఆయకు గట్టి దెబ్బతగిలింది. దీంతో అప్రమత్తమైన మూవీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో భాగంగా విక్రమ్ పక్కటెముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు విక్రమ్ ప్రమాద విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ్ ధ్రువీకరిస్తూ వివరాలు వెల్లడించారు. దీంతో చియాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
'తంగలాన్' షూటింగ్‌కు ముందు రిహార్సల్ చేస్తున్న సమయంలో గాయపడ్డారని.. ఆయన కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సూర్యనారయణన్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన కొద్ది రోజుల పాటు 'తంగలాన్' షూటింగ్‌కు దూరం కానున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విక్రమ్‌పై అభిమానులు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అతి త్వరలోనే కోలుకొని విక్రమ్ మళ్లీ షూటింగ్ కు హాజరవుతారని అన్నారు.
పంతొమ్మిదవ శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు విక్రమ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఇంతకింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విక్రమ్ గెటప్ గురించి అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈ స్టార్ హీరో.. ఈ సినిమాకు తగ్గట్టుగా తన లుక్‌ను మార్చుకున్నారు. ఇందులో భాగంగా విక్రమ్ డీ గ్లామరైజ్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ మూవీ కోసం ఆయన బరువు కూడా తగ్గినట్లు సమాచారం.