Chitra Shukla Marriage Date : టాలీవుడ్ అందాల హీరోయిన్ చిత్ర శుక్ల పెళ్లిపీటలెక్కబోతోంది. ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వీరి వివాహం జరగనున్నందున వధూవరులిద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు చిత్ర శుక్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Chitra Shukla Wedding Photos :కొన్నాళ్లుగా చిత్ర శుక్ల వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ అధికారితో ప్రేమాయణం సాగిస్తోంది. వైభవ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ ప్రేమను మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి వీరిద్దరూ డిసెంబరు 8న పెళ్లి వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర శుక్ల కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
Chitra Shukla Movies List :మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాతో తర్వాత ఓ తమిళ్ సినిమాలో చేసింది. అయితే ఈ రెండు సినిమాల్లో డ్యాన్సర్‌గా తెరపై కనిపించింది. 2016లో వచ్చిన 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది అందాల తార చిత్ర శుక్ల. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్ చేసింది.