ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ 'లూసీఫర్'కు రీమేక్ అని తెలియగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఫస్ట్‌లుక్ వస్తుందా? అంటూ వేచి చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. నల్ల కళ్లద్దాలు ధరించి, జేబులో పెన్ను పెట్టుకుని చిరు పవర్‌ఫుల్‌గా కనిపించారు. ముఖ్యంగా ఆయన హెయిర్, వాకింగ్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. చిరు నడకకు తగ్గట్టు తమన్ అందించిన నేపథ్య సంగీతం ఉర్రూతలూగించేలా ఉంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ చిత్రమిది. ఇందులో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాతోపాటు 'భోళా శంకర్' (మెహర్ రమేశ్ దర్శకుడు), బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు చిరంజీవి. మరోవైపు, వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమాను ఖరారు చేశారు. మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమని ఓ వేదికపై తెలిపారు.
ఫైట్ సీన్స్ చేస్తుండగా:ఇంటర్నెట్ డెస్క్: తాను హీరోగా నటిస్తున్న 'లాఠీ' సినిమా చిత్రీకరణలో విశాల్ మరోసారి గాయపడ్డారు. ఇంట్రడక్షన్ పోరాట దృశ్యాలు షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరగ్గా సంబంధిత వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసు అధికారి అయిన విశాల్ రౌడీ గ్యాంగ్‌ను అదుపు చేసే సన్నివేశమది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ చేస్తూనే విశాల్ ఉన్నట్టుండి పడిపోవడంతో సహ నటులంతా షాక్ అయ్యారు. ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేసి, ఆయన ఎడమ కాలికి గాయమైనట్టు గుర్తించారు. కాస్త విశ్రాంతి తీసుకున్న అనంతరం విశాల్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు.
ఇదే సినిమా చిత్రీకరణలో ఫిబ్రవరిలో తొలిసారి గాయపడ్డారు విశాల్. అప్పుడూ యాక్షన్ సన్నివేశాల్లో భాగంగానే ప్రమాదానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ పోలీసు కథతో దర్శకుడు ఎ. వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయిక. రమణ, నంద నిర్మాతలు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చదవండి:కలెక్షన్స్‌లో 'విక్రమ్' సరికొత్త మైలురాయి.. ఇక కమల్ అప్పులన్నీ తీరినట్టే!