తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Chiru 156 : శర్వాకు చిరంజీవి ఇప్పుడు ఫాదర్​ కాదట.. 'బ్రో' అంట! - చిరంజీవి శర్వానంద్​

Chiru 156 Movie Update : మెగాస్టార్​ చిరంజీవి కొత్త సినిమా (బ్రో డాడీ రీమేక్​)నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చేసింది! ఈ మూవీలో చిరు- శర్వానంద్​ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్నారట.

Chiru 156
Chiru 156

By

Published : Aug 4, 2023, 10:46 AM IST

Updated : Aug 4, 2023, 3:39 PM IST

Chiru 156 Movie Update : టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ చిత్రం షూటింగ్​ దశలో ఉండగానే.. మరో మూవీని లైన్​లో పెడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య విజయోత్సాహంతో భోళాశంకర్​లో నటించారు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే చిరంజీవి మరో సినిమాను లైన్‌లో పెట్టారు.

Chiranjeevi New Movie : టాలీవుడ్​ మరో సీనియర్​ హీరో అక్కినేని నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్​ కృష్ణతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. మలయాళంలో సూపర్​ హిట్​ అయిన బ్రో డాడీ మూవీ రీమేక్​ చేసేందుకు చిరు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత.. నిర్మించనున్నారు. మెగాస్టార్​కు జోడీగా త్రిష నటించనున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష మళ్లీ జత కట్టనున్నారు. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు.

అయితే ఈ చిత్రంలో చిరంజీవి కుమారుడి పాత్ర కోసం యంగ్​ హీరో సిద్ధు జొన్నలగడ్డ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారట. దీంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. చివరకు రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్‌‌ను చిరంజీవి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్‌ వచ్చింది. శర్వాకు జోడీగా యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీలను ఫిక్స్‌ చేశారని టాక్‌. అలా వారిద్దరూ చిరుతో నటించేందుకు గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశారన్న మాట. ఇప్పుడు మరో అప్డేట్​ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో శర్వానంద్​- చిరంజీవి.. తండ్రీకొడుకులు కాదట. అన్నదమ్ముళ్లుగా నటించనున్నారట. మాతృక చిత్రంలో ఇద్దరు హీరోలు తండ్రీ కొడుకులుగా కనిపిస్తే.. తెలుగులో మాత్రం ఇద్దరూ అన్నదమ్ముళ్లులా కనిపిస్తారట. తెలుగు వెర్షన్​కు ఈ రకంగా మార్పు చేసి డిజైన్ చేస్తున్నారని లేటెస్ట్ రూమర్.

Bro Daddy Remake : ఇకపోతే.. బ్రో డాడీ సినిమా విషయానికొస్తే మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ప్రియదర్శి, మీనా, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లూసిఫర్ సినిమాను రీమేక్ చేసిన ఆయన.. ప్రస్తుతం విడుదల కానున్న భోళా శంకర్ కూడా​ 'వేదాళం' సినిమాకు రీమేకే.

Last Updated : Aug 4, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details