Chiru 156 Movie : టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలకు కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి చాలా హుషారుగా కనిపిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి, ఆచార్య చిత్రాల ఫలితాలు నిరాశ కలిగించినా.. వాల్తేర్ వీరయ్యచిత్ర విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోష్‌లో ప్రస్తుతం ఆయన భోళాశంకర్ చిత్రం చేస్తున్నారు. తాజాగా చిరు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి చిత్రాలు రూపొందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి కమిట్ అయినట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటించనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!
Chiru 156 Movie Cast : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన త్రిష.. ఈ చిత్రంలో చిరంజీవితో జత కట్టనుందని తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన యంగ్ హీరోయిన్ శ్రీలీల, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ సైతం కీలక పాత్రలు పోషించనుండగా.. మలయాళ హిట్ బ్రో డాడీ మూవీకి రీమేక్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బ్రో డాడీ రీమేక్
Bro Daddy Remake : ఇక బ్రో డాడీ సినిమా విషయానికొస్తే.. కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. కల్యాణి ప్రియదర్శి, మీనా, మోహన్ లాల్, కావ్య శెట్టి తదితరులు నటించారు. ఈ మూవీ స్టోరీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు, కామెడీ టైమింగ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పైగా చిరంజీవి సైతం కొత్త కథలతో ప్రయోగాలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చేసిన ఆయన.. ప్రస్తుతం వేదాళం రీమేక్‌గా భోళా శంకర్ చేస్తున్నారు.
హీరోయిన తమన్నా.. చెల్లెలిగా కీర్తి
Bholasankar Movie :భోళా శంకర్ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. సుశాంత్, జబర్దస్త్ వేణు, రఘుబాబు, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా.. లేటెస్ట్‌గా సెట్స్ నుంచి సంగీత్ సాంగ్ షూటింగ్ వీడియోను లీక్ చేశారు మెగాస్టార్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.