Chiranjeevi new movie 2023 : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీఎంట్రీలో 'ఖైదీ నెo.150'తో మంచి హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లకు సైన్ చేసేశారు. కానీ 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్‌ఫాదర్'తో తన రేంజ్‌కు తగ్గట్టు భారీ హిట్‌ను అందుకోలేదు. అయితే 'వాల్తేరు వీరయ్య'తో మాత్రం భారీ కమర్షియల్ హిట్‌ను అందుకుని.. రెండు వందల కోట్ల క్లబ్ హీరోల్లో చేరిపోయారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ 'భోళాశంకర్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో తమన్నాకు హీరోగా.. కీర్తిసురేశ్‌కు అన్నయ్యగా నటిస్తున్నారు. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
Kalyan krishna kurasala movies : దీంతో చిరంజీవి.. తర్వాత నటించాల్సిన తన కొత్త సినిమాలను లైన్లో పెట్టే పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు కూడా జరిపారు. ఇందులో భాగంగానే ఆయన బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాలతో సినిమా ఓకే చేశారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. చిరు పుట్టిన రోజు ఆగస్ట్ 22న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నారట. అందుకు కావాల్సిన ఏర్పట్లను కూడా చేస్తున్నారని తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చిరు పుట్టినరోజు కొత్త సినిమా ప్రకటన రావడం ఖాయం. ఇప్పటికే ఈ వార్త కొంతమంది చిరు అభిమానులకు తెలిసి ఫుల్ ఖుషి అవుతున్నారు.
Chiru 156 movie : ఇక కల్యాణ్ కృష్ణ కురసాలతో చేయబోయే సినిమాలో నటించే నటీనటుల గురించి ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇందులో చిరు సరసన ఆయన భార్యగా.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న సీనియర్ హీరోయిన్ త్రిష నటించనుందట. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ జోడీ కలిసి నటించనున్నారు. చివరిసారిగా వీరిద్దరు కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు. ఇక డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా మరో ప్రధాన పాత్ర పోషించనున్నారట. ఆయన.. చిరుకు కొడుకుగా నటించే అవకాశముంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నలిచిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనుందట.