తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కదలలేని స్థితిలో కైకాల.. బైడ్​పైనే కేక్​ కట్​ చేయించిన చిరు - కైకాల సత్యనారాయణ

Chiranjeevi wishes Kaikala satyanarayana: సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేత కేక్​ కట్​ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు.

Chiranjeevi wishes Kaikala satyanarayana
కదలలేని స్థితిలో కైకాల

By

Published : Jul 25, 2022, 6:23 PM IST

Chiranjeevi wishes Kaikala satyanarayana: సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్‌ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకలోకైకాల సత్యనారాయణ కుమారులు కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు (చిన్నబాబు), కైకాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కాగా, కొద్ది రోజుల క్రితం కైకాల సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కైకాల హాస్పిటల్​లో చేరినప్పటి నుంచి మెగాస్టార్​ చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఆయన బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలో చిరు అయితే వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కైకాల కుటుంబానికి ధైర్యం చెబుతూ వారికి అండగా నిలిచారు. ఇక చిరంజీవి- కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్‌ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటివి వీరి సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచాయి.

ఇదీ చూడండి: సినిమా షూటింగ్‌లు బంద్‌.. నిర్మాతలు ఏం నిర్ణయించారంటే?

ABOUT THE AUTHOR

...view details