Acharya Chiranjeevi wishes Hanuman Jayanthi: శ్రీరామబంటు ఆంజనేయుడికి అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి పరమ భక్తుడని అందరికీ తెలిసిన విషయమే. శనివారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఆయన ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. 'ఆచార్య' లొకేషన్స్‌లోని కొన్ని అపురూప దృశ్యాలను ఈ వీడియోలో పొందుపరిచారు. దేవాలయాలు, వాటిలో జరుగుతోన్న అవినీతి కథాంశంతో రూపుదిద్దుకున్న 'ఆచార్య' షూట్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లపై ఆయా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, సిద్ధ పాత్ర కోసం చరణ్ తన కాటేజీలో సిద్ధమవుతోన్న వేళ అక్కడికి ఓ వానరం వచ్చింది. దాన్ని గమనించిన చరణ్ తన వద్ద ఉన్న బిస్కెట్స్‌ని దానికి అందించారు. వానరం వాటిని తింటూ అక్కడే కూర్చొంది. ఈ వీడియోని షేర్ చేసిన చిరు.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందర్నీ ఆకర్షిస్తోంది.
చిరు స్పెషల్ పోస్ట్.. 'ఆచార్య' సెట్‌లో ఏం జరిగిందంటే.. - చిరంజీవి ఆచార్య
Acharya Chiranjeevi wishes Hanuman Jayanthi: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. ఏం చేశారంటే..
ఆచార్య