మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దూసుకెళ్తోంది. సూపర్ హిట్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటోంది. మొత్తంగా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
Waltair veerayya: వంద కోట్ల క్లబ్లో 'వాల్తేరు వీరయ్య'.. మూడు రోజుల్లో ఎంతంటే? - Waltair veerayya collections
మెగాస్టార్ చిరంజీవి-రవితేజ నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మొత్తంగా మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
కాగా, చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్‌లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి. చిరు డ్యాన్స్‌లు, నటన చూసిన వారందరూ వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ సినిమా వీపరీతంగా అలరిస్తోంది. ప్రకాష్ రాజ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్, కేథరిన్ హీరోయిన్స్‌గా కనిపించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇదీ చూడండి:రాజమౌళి, కీరవాణిపై అవతార్ డైరెక్టర్ ప్రశంసలు.. భార్యతో కలిసి 2 సార్లు సినిమా చూశానంటూ..