Chiranjeevi Vasishta Movie : బింబిసార దర్శకుడు వశిష్ఠ - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సోషియో ఫాంటసీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పంచభూతాల నేపథ్యంలో విజువల్ వండర్‌గా రాబోతుంది. బింబిసార లాంటి హిట్ చిత్రం తర్వాత వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం వల్ల... ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో, విజువల్ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
పైగా అటు ఆడియెన్స్‌తో పాటు ఇటు అభిమానులు కూడా చిరును తన వయసుకు తగ్గ పాత్రల్లో చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రొట్ట డ్యాన్స్, హీరోయిన్స్‌తో రొమాన్స్ పక్కన పెట్టి కొత్తగా చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టే.. ఈ మెగా 157లో చిరు కనపడనున్నారని అర్థమైంది. ఈ విషయాన్ని దర్శకుడు వశిష్ఠ కూడా కన్ఫామ్ చేశారు.
తాను చిన్నతనంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు వశిష్ఠ. అప్పటి పిల్లలకు ఆ చిత్రం అంటే చాలా బాగా ఇష్టమని.. అలాగే ఇప్పటి పిల్లలకు కూడా అలాంటి చిరునే చూపిస్తానని అన్నారు. సినిమాలో నాలుగురు హీరోయిన్ల వరకు ఉంటారు కానీ.. వారితో ఎలాంటి రొమాన్స్ సన్నివేశాలు ఉండవట. కేవలం ఇతర కీలక పాత్రల రూపంలోనే వాళ్లు ఉంటారట. వారిలో ఇప్పటికే అనుష్క శెట్టి పేరు ఫైనలైజ్ అయినట్లు సమాచారం అందింది. ఇతర హీరోయిన్లను ఎవరిని తీసుకోవాలో అనే పనిలో మూవీటీమ్ ఉందట.