తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్​.. చిరుకు రవితేజ వార్నింగ్​.. బాక్స్​లు బద్దలైపోతాయంటూ.. - ​ చిరంజీవి వాల్తేరు వీరయ్య సాంగ్స్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ వచ్చేసింది. ఆ ప్రచార చిత్రం ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Chiranjeevi valteru veeraiah trailer released
పవర్​ఫుల్​గా 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్

By

Published : Jan 7, 2023, 6:06 PM IST

Updated : Jan 7, 2023, 6:26 PM IST

పూనకాలు లోడింగ్‌.. పూనకాలు లోడింగ్‌.. అంటూ ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' మూవీటీమ్​ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే అదేంటో చూపించేశారు దర్శకుడు బాబీ. చాలా కాలంగా మెగాఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్​ను తాజాగా విడుదల చేశారు. ఇది చూస్తుంటే.. మెగాఫ్యాన్స్​కు కావాల్సిన అన్ని యాక్షన్​, డైలాగ్స్​, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్​ ఈ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నాయి.

'మీ కథలోకి నేను రాలా.. నా కథలోకి మీరందరూ వచ్చారు. వీడు నా ఎర.. నువ్వే నా సొర' అంటూ మాస్‌ డైలాగ్స్​తో అదరగొట్టేశారు చిరంజీవి. ఇక ప్రచార చిత్రం చివర్లో 'రికార్డుల్లో నా పేరుండటం కాదు నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయని' అంటూ అభిమానులు చేత విజిల్స్​ వేయించేశారు. మొత్తంగా వీరయ్యగా చిరు వింటేజ్‌ మాస్‌ లుక్‌లో అదరగొట్టారు. ఆయన చేసిన కామెడీ తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్​లో.. 'వైజాగ్‌లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట' అంటూ రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన పోలీస్​ ఆఫీసర్​గా అదరగొట్టేశారు. 'ఒక్కొక్కడికి బాక్సులు బద్ధలైపోతాయని' అంటూ చిరంజీవికే వార్నింగ్‌ ఇస్తూ కనిపించారు. మొత్తంగా ఈ ప్రచార చిత్రంలో వీరయ్యగా చిరు వింటేజ్‌ మాస్‌ లుక్‌ అదిరిపోయింది. ఇక ఆయన డైలాగ్స్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ కూడా బాగానే ఉన్నాయి.

కాగా, వినూత్నమైన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో బాబీ (కె.ఎస్‌.రవీంద్ర)తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ నాయిక. ఇందులో హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌.

ఇదీ చూడండి:ఇది కదా అభిమానం అంటే బాలయ్య ఫ్యాన్స్​ హంగామా మాములుగా లేదుగా

Last Updated : Jan 7, 2023, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details