తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వారిపై మెగాస్టార్​ చిరు సీరియస్​.. ఎందుకలా చేస్తారంటూ.. - godfather movie chiru speech

హీరో చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్​ఫాదర్'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం.. శనివారం సక్సెస్​మీట్​ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడిన విశేషాలు మీకోసం..

chiranjeevi speech in god father movie success meet
chiranjeevi speech in god father movie success meet

By

Published : Oct 9, 2022, 6:35 AM IST

Updated : Oct 9, 2022, 3:17 PM IST

God Father Movie Success Meet: "నా జీవితంలో అత్యద్భుతమైన పదిహేను సినిమాల్లో 'గాడ్‌ఫాదర్‌' ఒకటి. ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది" అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రధారిగా, మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించారు. సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, నయనతార కీలక పాత్రధారులు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు.

చిరంజీవి, సత్యదేవ్​

చిరంజీవి మాట్లాడుతూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. "ఈ రోజుల్లో కంటెంట్‌ బాగుంటే సినిమాకి వస్తారని నేనే చెప్పాను. ఈ సినిమాతో ఆ నమ్మకం నిజమైంది. పారితోషికం కోసం ఎవ్వరం పనిచేయలేదు. విజయం ఇవ్వాలని పనిచేశాం. మేం సినిమాపై నమ్మకంగా ఉన్నా, ప్రచారం గురించి పలు రకాలుగా మీడియాలో వార్తలొచ్చాయి. మేం ఏం చేయాలో కూడా మీడియానే నిర్దేశిస్తుంటే అది చికాకుగా ఉంటుంద"న్నారు. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవంటూ సల్మాన్‌ఖాన్‌కి పారితోషికం ఇవ్వడానికి వెళితే తిరస్కరించారన్నారు చిరంజీవి.

గాడ్​ఫాదర్​ చిత్రబృందం

ఈ కార్యక్రమంలో మోహన్‌రాజా, ఎడిటర్‌ మోహన్‌, మురళీమోహన్‌, సర్వదమన్‌ బెనర్జీ, కె.ఎస్‌.రామారావు సత్యానంద్‌, డి.వి.వి.దానయ్య, ఛోటా కె.నాయుడు, లక్ష్మీభూపాల్‌, మెహర్‌ రమేష్‌, మురళీశర్మ, సునీల్‌, దివి, సత్యదేవ్‌, విక్రమ్‌, కస్తూరి, వాకాడ అప్పారావు, షఫి, మురళీశర్మ, పవన్‌తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:మాల్దీవుల్లో రష్మిక చిల్​.. బ్యాక్​ పోజులతో అషురెడ్డి

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్​.. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్​ షురూ.. ఎవరంటే?

Last Updated : Oct 9, 2022, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details