ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగాఅభిమానులకు శుభవార్త. రామచరణ్ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్మీడియాలో ట్వీట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. "హనుమాన్ జి ఆశిస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. రామ్‌చరణ్ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని" అని రాసుకొచ్చారు.
మెగాఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్-ఉపాసన - ramchran father news
14:47 December 12
తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్-ఉపాసన
కాగా, చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ చరణ్, ఉపాసన ఒకే స్కూల్‌లో చదివారు. 2012 జూన్ 14న వీరిద్దరు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ ఏడాదితో పదేళ్లు పూర్తైంది. పెళ్లి తర్వాత ఈ జోడీ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది. ఓ వైపు రామ్ చరణ్ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఉపాసన. సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేస్తూనే సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం చరణ్ హీరోగా, నిర్మాతగా రాణిస్తూ తన సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్తో బిగ్ సక్సెస్ను అందుకున్న ఆయన.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం బడా డైరెక్టర్ శంకర్రో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు.
పిల్లలెప్పుడు.. పెళ్లై పదేళ్లు అవుతున్నా చరణ్ దంపతులు ఎలాంటి శుభవార్త చెప్పకపోవడం వల్ల 'పిల్లలెప్పుడు' అంటూ అనేక సందర్భాల్లో ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే వాటిపై ఉపాసన స్పందించేవారు కాదు. ఇదే విషయమై ఇటీవల ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ కార్యక్రమంలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. "మా పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, నా కుటుంబాన్ని నేనెంతో ప్రేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా ఆర్ఆర్ఆర్ (రిలేషన్‌షిప్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ మై లైఫ్) గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు?. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది" అని ఉపాసన అడగ్గా, జగ్గీవాస్ దేవ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా, ఇప్పుడు చిరంజీవి ప్రకటన మెగా అభిమానుల్లో ఆనందాన్ని నెలకొంది. సోషల్మీడియా వేదికగా రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదీ చూడండి:'కాంతార' హీరోను చూస్తుంటే అసూయగా ఉంది: బాలీవుడ్ స్టార్