తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రైవేట్ పార్టీలో చిరు, సల్మాన్​, వెంకీ సందడి.. - చిరంజీవి సల్మాన్​ ఖాన్ వెంకటేశ్​ స్పెషల్ పార్టీ

Chiru Venky Salman party: మెగాస్టార్​ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్​, బాలీవుడ్ భాయ్​ సల్మాన్​ ఖాన్​ కలిసి ఓ ప్రైవేట్​ పార్టీలో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారగా.. ముగ్గురిని ఓకే ఫ్రేమ్​లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Chiru Salman venky party
ప్రైవేట్ పార్టీలో చిరు, సల్మాన్​, వెంకీ సందడి

By

Published : Jun 22, 2022, 2:15 PM IST

Chiru Venky Salman party: లోకేశ్​కనగరాజ్​ దర్శకత్వంలో విడుదలైన 'విక్రమ్' సినిమా సక్సెస్​ అవ్వడం వల్ల చిత్రయూనిట్​కు ఇటీవలే స్పెషల్​ పార్టీ ఇచ్చారు మెగాస్టార్​ చిరంజీవి. ఈ వేడుకలో యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​, ఓ మూవీ షూటింగ్​ కోసం హైదరాబాద్​ వచ్చిన బాలీవుడ్​ స్టార్​ కండవీరుడు సల్మాన్​ ఖాన్​ పాల్గొని సందడి చేశారు. ఈ ముగ్గరిని ఓకే ఫ్రేమ్​లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడీ స్టార్స్ మళ్లీ ఓ ప్రైవేట్ పార్టీలో కలిసి ఎంజాయ్​ చేశారు. కానీ ఈ సారి కమల్​కు బదులు విక్టరీ వెంకటేశ్​ ఇందులో పాల్గొన్నారు. ఈ ముగ్గురు కలిసి చిల్​ కొడుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సరదాగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది. ఈ వేడుక.. ఈ ముగ్గురికి తెలిసిన ఓ కామన్ ఫ్రెండ్​ నివాసంలో జరిగినట్లు తెలిసింది. కాగా, సల్మాన్​ ఖాన్​ నటిస్తున్న 'కభీ ఈద్​ కభీ దివాలీ'లో వెంకటేశ్​, రామ్​చరణ్​ ఓ కీలక పాత్ర పోషస్తుండగా.. చిరంజీవి 'గాడ్​ఫాదర్'​లో సల్మాన్​ఖాన్​ గెస్ట్​ రోల్​ పోషిస్తున్నారు. ఈ షూటింగ్​ల నిమిత్తం భాయ్​ హైదరాబాద్​లో ఉంటున్నారు.

ఇక ఈ ముగ్గురి హీరోల సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'ఆచార్య'తో ప్రేక్షకులను పలకరించిన చిరు.. ప్రస్తుతం 'గాడ్​ఫాదర్​', 'వాల్తేరు వీరయ్య'లో.. సల్మాన్.. 'కభీ ఈద్​ కభీ దివాలీ'తో పాటు 'టైగర్​ 3', 'పఠాన్'(అతిథి పాత్ర)లో నటిస్తున్నారు. ఇక 'ఎఫ్​ 3'తో సందడి చేసిన వెంకటేశ్​.. త్వరలోనే 'రానానాయుడు' వెబ్​సిరీస్​తో అభిమానులను అలరించనున్నారు. ​

ఇదీ చూడండి: నటుడి ప్రాణం మీదకు తెచ్చిన విన్యాసం.. విమానంలో ఆస్పత్రికి తరలింపు!

ABOUT THE AUTHOR

...view details