Chiranjeevi Acharya pre release event: చిరంజీవి, ఉపాసన.. వీళ్లిద్దరిలో చరణ్ ఎక్కువగా ఎవరికి భయపడతారో తెలుసా?.. చిరంజీవి, చరణ్ వీళ్లిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?.. చిరంజీవికి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా?.. ఇలాంటి ఎన్నో సరదా ప్రశ్నలకు వేదికైంది 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా చిరంజీవి, చరణ్, చిత్ర దర్శకుడు కొరటాల శివను సుమ కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు.
సుమ: మీ అమ్మగారి చేతి వంట బెస్టా? లేదా మీ సతీమణి సురేఖ చేతి వంట బెస్టా?
చిరంజీవి: నూటికి నూరు శాతం అమ్మే. అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంట, గుండెలకు హత్తుకుని ఆమె చూపించే ప్రేమాభిమానం.. దానికి మించిన తీపిదనం, కమ్మదనం ఎక్కడైనా ఉంటుందా..! (మధ్యలో సుమ అందుకుని.. సురేఖ గారు ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనల్‌గా అత్తగార్లకే మార్కులు వెళతాయి) (నవ్వులు)
సుమ: పవన్‌కల్యాణ్ లేదా చిరంజీవి.. వీళ్లిద్దరిలో ఎవరు మీకు ఆచార్య?
రామ్‌చరణ్:మొదట ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్పిన వారిని ఒక్కసారి ఇటు రమ్మని చెప్పండి (నవ్వులు). ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆచార్యుల నుంచి వాతలు పడతాయి.. కాబట్టి వద్దు.
చిరంజీవి: చరణ్ తరఫున ఈ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. చరణ్.. నా నుంచి క్రమశిక్షణ.. వాళ్ల బాబాయ్‌ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు.
సుమ: నిర్మాత చరణ్ లేదా యాక్టర్ చరణ్.. ఎవరితో వర్క్ చేయడానికి మీరు సౌకర్యవంతంగా ఫీలయ్యారు?
రామ్‌చరణ్: నేను ఈ చిత్రాన్ని నిర్మించలేదండి. కొణిదెల ప్రొడెక్షన్ పేరు వేశాం కానీ.. కర్త, కర్మ అన్నీ నిరంజన్ రెడ్డినే. సెట్‌లోకి నటుడిగానే వెళ్లాను. ప్రొడ్యూసర్‌గా వెళ్లలేదు.
కొరటాల శివ: నాకెప్పుడూ యాక్టర్ చరణ్‌తోనే సౌకర్యంగా ఉంటుంది.
సుమ: చిరంజీవి, చరణ్ వీళ్లిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?
రామ్‌చరణ్: చిరంజీవి
చిరంజీవి: నా పేరు శివ శంకర వరప్రసాద్. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడు ముందు ఎంతోమంది డ్యాన్స్‌లు వేస్తారు. దాన్నే డ్యాన్స్ అని ఫీలవుతుంటారు. అది ఎవరైనా సరే.. శివుడి తర్వాతే. ఆయన తాండవం తర్వాతే.
కొరటాల శివ: ఈ శివుడిది కూడా అదే సమాధానం.
చిరంజీవి:ఎదుటివాళ్లని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేనే కావాలని తగ్గి.. వాళ్లకు అవకాశం ఇస్తుంటాను.
కొరటాల శివ: ‘భలే భంజారా’ సాంగ్ షూటింగ్ అప్పుడు.. ఫస్ట్ లైవ్‌లో చిరంజీవి డ్యాన్స్‌నే చూశాను. ఆ తర్వాతే చరణ్‌ని చూశాం.
సుమ: ఒక సినిమాకి డైరెక్టర్ లేదా యాక్టర్.. ఎవరు ఎక్కువ?