తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగాస్టార్​ మంచి మనసు, ఈ సారి సినీ కార్మికుల కోసం - మెగాస్టార్ చిరంజీవి బర్త్​డే

Chiranjeevi Promises to build hospital మెగాస్టార్​ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించడం సహా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సాయం చేస్తున్న చిరు, ఈ సారి సినీకార్మికుల కోసం ఓ ఆస్పత్రి కట్టించనున్నారు.

Chiranjeevi Promises to build hospital
సినీకార్మికుల కోసం ఆస్పతి కట్టిస్తానన్న మెగాస్టార్ చిరంజీవి

By

Published : Aug 20, 2022, 10:30 AM IST

Chiranjeevi Promises to build hospital ఒక చిత్రాన్ని తెరకెక్కించడంలో తెరవెనుక ఎంతో శ్రమిస్తున్న సినీ కార్మికుల కోసం తాను ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేయనున్న ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి, సేవలు అందిచేలా చూస్తానని మాటిచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎదుటివారికి చేతనైనంత సాయం చేసినప్పుడు వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదని ఆయన అన్నారు.

"మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆట విడుపుగా ఉండేందుకు కొంతమంది క్రికెట్‌ ఆడుతుంటారు. కేవలం సరదా కోసమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా, ఒక సేవా కార్యక్రమంగా దీన్ని మార్చిన గొప్పతనం తరుణ్‌, శ్రీకాంత్‌దే. అందుకు వాళ్లిద్దర్నీ అభినందించాలి. ప్రేక్షకుల అభిమానానికి రుణం తీర్చుకొనేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నాం"

సినీకార్మికుల కోసం ఆస్పతి కట్టిస్తానన్న మెగాస్టార్ చిరంజీవి

"కెరీర్‌ ఆరంభంలో ప్రతి ఒక్కరూ కొంత స్వార్థంగా ఉండటం సహజమే. బాగా సంపాదించాలని, వచ్చిన డబ్బుతో సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. జీవితంలో ఒక దశకు వచ్చాక.. ఎదుటివారికి ఏదైనా సాయం చేయాలనే భావన కలుగుతుంది. కష్టాల్లో ఉన్నవాడి ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అదెలా ఉంటుందో అనుభవ పూర్వకంగా నేను తెలుసుకున్నా. మొదట్లో నేను కూడా విలాసవంతమైన కార్లు కొనాలి, విదేశీ ప్రయాణాలు చేయాలి, నా కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సుఖమైన జీవితాన్ని అందించాలనుకున్నా. అందుకోసం ఎంతో శ్రమించా. పారితోషికం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్లు అయ్యాక.. నాకు ఇంతటి అభిమానాన్ని అందించిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే భావన కలిగింది. అలా సేవా కార్యక్రమాల్లో భాగమయ్యా. బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించా. అది ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోందంటే దాని వెనుక ఎంతోమంది సహకారం ఉంది. వాళ్లందరికీ మరోసారి ధన్యవాదాలు. సినిమా సక్సెస్‌ అయినప్పటి కంటే ఒకరికి సాయం చేసినప్పుడు లభించిన తృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోజు ప్రశాంతంగా నిద్రపోతాం"

చిరు బర్త్​డే సెలబ్రేషన్స్​

"మా అందరికీ చదువులు అంతంత మాత్రమే. అయినా మేం సౌకర్యవంతంగా జీవిస్తున్నామంటే దానికి సినీ పరిశ్రమే కారణం. అందుకే సినిమా కోసం శ్రమిస్తున్న కార్మికులకు చిత్రపురి కాలనీలో ఓ ఆస్పత్రి కట్టించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. రోజువారీ సినీ కార్మికులకు ఉపయోగపడేలా 10 పడకలతో ఓ ఆస్పత్రి ఉంటే బాగుంటుందనిపించింది. మా నాన్నగారు కొణిదెల వెంకట్రావు పేరుతో ఈ ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నాం. ఈ పుట్టినరోజుకు మీకు మాటిస్తున్నా.. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఆసుపత్రి కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఈ ఆస్పత్రికి చేయూతనందిస్తున్న తమ్ముళ్లందరికీ, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ ఆస్పత్రి నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములవుతానంటే సంతోషంగా ఆహ్వానిస్తా. దానికి ఎన్నికోట్లు ఖర్చైనా మొత్తం భరించే శక్తి ఆ భగవంతుడు నాకిచ్చాడు. మా ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న వర్కర్స్‌కు దీన్ని ఏర్పాటు చేయడం నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నా" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరు బర్త్​డే సెలబ్రేషన్స్​

చిరు ప్రకటనతో స్టేజ్‌పై ఉన్న శ్రీకాంత్‌, తరుణ్‌, తమన్‌, సుధీర్‌ బాబు.. పలువురు నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తమన్‌ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రికి సాయం చేసేందుకు తాను ఓ మ్యూజికల్‌ షో ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానని ప్రకటించారు. తమన్‌ సాయానికి చిరు ఎంతో ఆనందించారు. సినీ కార్మికులకు చిరు చేస్తోన్న సాయం తెలుసుకున్న మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా చిరు నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తరుణ్​, శ్రీకాంత్​తో చిరు

ఇదీ చూడండి: కవలలకు జన్మనిచ్చిన నటి నమిత, ఫ్యాన్స్​ ఖుషీ

ABOUT THE AUTHOR

...view details