Chiranjeevi Mega 156 Vishwambhara Title Concept Video Anil Kumar Upadyayula : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. బింబిసార వంటి హిట్ తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ టైటిల్ కాన్సెప్ట్ గ్లింప్స్ బాగుందంటూ ఆడియెన్స్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. వీడియోలోని గ్రాఫిక్స్ విజువల్స్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
అయితే ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? అతని పేరే అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో పలు సినిమాలకు పని చేశారు. త్వరలోనే డైరెక్టర్గా మారి మెగా ఫోన్ కూడా పట్టుకోబోతున్నారని బయట కథనాలు వస్తున్నాయి.