బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా నుంచి తాజాగా దీపావళి సందర్భంగా బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రచారంలో ఉన్న వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ.. టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. చిరు డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక లుక్ విషయానికొస్తే.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో చిరు ఊరమాస్ గెటప్‌లో అదిరిపోయారు. మొత్తంగా ఈ వీడియో మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. దీనిని చూసిన నెటిజన్లు.. చిరంజీవి నటించిన ఒకప్పటి మాస్ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు.
పవర్‌ఫుల్‌గా 'మెగా 154' టైటిల్ టీజర్.. ఊరమాస్ గెటప్‌లో అదరగొట్టిన చిరు - చిరంజీవి వాల్తేరు వీరయ్య
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంవీజి మెగా 154 టైటిల్ టీజర్ విడుదలైంది. ఇది ఫ్యాన్స్‌కు పూనకాలు తెచ్చేలా ఉంది.
మాస్ ఎంటర్ టైనర్‌గా రానున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడం పై దృష్టి పెట్టినట్లు సమాచారం. రవితేజ దీనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: అల్లు ఇంట్లో దీపావళి వేడుకలు.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ