తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Chiranjeevi Happy Birthday : చిరు కొత్త మూవీస్​ అనౌన్స్​మెంట్స్​​.. ఈ సారి యూనివర్స్​ను మించేలా మెగామాస్​ - uv creations chiranjeevi

Chiranjeevi Happy Birthday : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన కొత్త సినిమాలు గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్స్ వచ్చాయి. ఆ వివరాలు..

Chiranjeevi Happy Birthday
Chiranjeevi Happy Birthday : చిరు కొత్త మూవీస్​ అనౌన్స్​మెంట్స్​​.. ఈ సారి యూనివర్స్​ను మించేలా మెగామాస్​

By

Published : Aug 22, 2023, 10:59 AM IST

Updated : Aug 22, 2023, 12:23 PM IST

Chiranjeevi Happy Birthday : మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాల నుంచి సినీ ప్రియులను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. డ్యాన్స్​, కామెడీ, ఫైట్స్​, యాక్షన్‌, ఎమోషన్​... ఇలా నవరసాలన్నింటినీ పండిస్తూ ఫ్యాన్స్​ను ఎంటర్​టైన చేస్తున్నారు. తన వ్యక్తిత్వంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భాంగా ఆయన కొత్త సినిమాల అఫీషియల్​ అనౌన్స్​ మెంట్స్​ వస్తున్నాయి.

Mega 156 Movie :అయితే మెగాస్టార్​ చిరంజీవి తన 156వ సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గోల్డెన్ బాక్స్​ ఎంటర్​టైన్మెంట్స్​లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇప్పుడా సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. '4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి..' అని రాసుకొచ్చి ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. 155 సినిమాల తర్వాత రాబోతున్న ఈ సినిమా మెగా రాకింగ్​గా ఉండనుందని పేర్కొంది. ఈ పోస్టర్​లో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తుకుంటూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో ఆయన నటించిన గత సూపర్ హిట్​ సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. అయితే ఈ చిత్ర వివరాల గురించి ఏమీ చెప్పలేదు. ఈ సినిమాకు మలయాళ సూపర్ హిట్ చిత్రం బ్రో డ్యాడీకి రీమ్​క్​గా రానుందని మొదటి నుంచే ప్రచారం సాగుతోంది. దీనికి బంగార్రాజు ఫేమ్​ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు(kalyan krishna chiranjeevi).

Mega 157 Movie :ఈ చిత్రం తర్వాత చిరంజీవి తన 157 సినిమాను యూవీ క్రియేషన్స్​(uv creations chiranjeevi) బ్యానర్​లో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ కూడా వచ్చింది. మూవీటీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్​ను రిలీజ్ చేసింది. 'బింబిసార'తో సూపర్​ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది కూడా సోషియో ఫాంటసీగా రానుంది. మెగా స్టార్ అనే శక్తి కోసం నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు కలుస్తున్నాయి. ఈ సారి మెగామాస్​ యూనివర్స్​ను దాటి ఉండబోతుందని అంటూ క్యాప్షన్​ పేర్కొంది. క్యాప్షన్​కు తగ్గట్టే పోస్టర్​ను డిజైన్ చేశారు. స్టార్​ ఆకారంలో ఉన్నఈ పోస్టర్​లో త్రిశూలంతో పాటు పంచభూతాలను చూపిస్తూ డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్​తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా అభిమానుల్లో మొదలైపోయింది. పంచభూతాలకు అధిపతిలా చిరంజీవి చూపిస్తారో.. లేదంటే వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఓ అసమాన శక్తి ఉన్న మానవుడిలా చూపుతారో వేచి చూడాలి. గతంలో 2004లో దాదాపు ఇలాంటి కాన్సెప్ట్​ 'అంజి' సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమాలో నటించనున్నారు

Chiranjeevi Happy Birthday : ఆహా.. చిరు డ్యాన్స్​ సీక్రెట్ ఇదా​.. ఆ రోజు ఆయన చెప్పిన మాట వల్లే ఇదంతా

Last Updated : Aug 22, 2023, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details