తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిరు వర్సెస్​ విక్రమ్​.. ఎన్టీఆర్​-వంశీపైడిపల్లి సినిమా! - Vikram cobra release date

కొత్త సినిమాలకు సంబంధించి పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మెగాస్టార్​ చిరంజీవి 'గాడ్​ఫాధర్'​, విక్రమ్ 'కోబ్రా', ఎన్టీఆర్, వంశీపైడిపల్లి చిత్రాల సంగతులు ఉన్నాయి.

Chiranjeevi vs Vikram
చిరు వర్సెస్​ విక్రమ్

By

Published : May 22, 2022, 2:00 PM IST

Chiranjeevi vs Vikram: 'ఆచార్య'తో ప్రేక్షకుల్ని పలకరించిన మెగాస్టార్​ చిరంజీవి.. తన కొత్త సినిమా 'గాడ్​ఫాదర్'​ను కూడా త్వరలోనే థియేటర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆగస్ట్​ రెండో వారంలో రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారట. దీనికి తమిళ దర్శకుడు మోహన్​రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆగస్టు రెండో వారంలో ఖర్చీఫ్​ వేసారు తమిళ స్టార్ హీరో విక్రమ్​. ఆయన హీరోగా నటించిన 'కోబ్రా' ఆసగ్టు 11న భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్​ వద్ద చిరు-విక్రమ్​ల మధ్య వార్​ తప్పనిసరి అని సినీవర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే వీరిద్దిరితో పాటు అఖిల్​ 'ఏజెంట్'​, సమంత 'యశోద' కూడా అదే వారంలో రిలీజ్ కానున్నాయి.

Vamshi Paidipally NTR movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ సినిమా విజయంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇక మే 20న తన పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్‌ జరుపుకొన్నారు. క్లోజ్‌ఫ్రెండ్స్‌ సమక్షంలో ఎన్టీఆర్‌ నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొనడంతో నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌తో సినిమా చేస్తోన్న వంశీ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేయనున్నారా? ఎన్టీఆర్‌-వంశీ కాంబోలో సినిమా రానుందా? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వంశీ-ఎన్టీఆర్‌ కాంబోలో ఇప్పటికే ‘బృందావనం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, తారక్‌ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తారక్‌ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: కమల్​హాసన్​ డేట్స్​ కోసం జక్కన్న, ప్రశాంత్​ నీల్​ ప్రయత్నాలు!

ABOUT THE AUTHOR

...view details