మెగాఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చింది గాడ్‌ఫాదర్ మూవీటీమ్. చిత్రంలోని మరో పవర్ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. నజభజ అంటూ సాగే ఈ సాంగ్‌ను యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించారు. ఇందులో చిరు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని వివరించే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించారు. తమన్ స్వరాలందించారు. 'అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కలబడితే కథకళిరా' చరణాలు పవర్‌ఫుల్‌గా సాగాయి. కాగా, ఇటీవలే 'తార్ మార్ తక్కర్ మార్' పాట కూడా విడదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సల్మాన్, చిరు కలసి చిందులేశారు.
God Father: మరో పవర్ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరు యాక్షన్ సూపర్ - గాడ్‌ఫాదర్ నజభజ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమా నుంచి మరో అదిరిపోయే సాంగ్ రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

గాడ్‌ఫాదర్ సాంగ్ రిలీజ్
చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందింది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. రామ్‌చరణ్, ఆర్.బి. చౌదరి, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది.
ఇదీ చూడండి: ఊర్రూతలూగిస్తున్న బాలయ్య 'అన్‌స్టాపబుల్' యాంథమ్.. అదిరిపోయింది అంతే!
Last Updated : Sep 27, 2022, 5:36 PM IST