Chirajeevi Godfather release date: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గాడ్ ఫాదర్'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్'రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టంట్లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Allarinaresh new movie poster: అల్లరి నరేష్ అనగానే హాస్య ప్రధానమైన కథలే గుర్తుకొస్తాయి. ఆయన అప్పుడప్పుడూ గాఢమైన భావోద్వేగాలు నిండిన కథల్లోనూ నటించి మెప్పించారు. 'విశాఖ ఎక్స్‌ప్రెస్', 'గమ్యం', 'నాంది' తదితర చిత్రాలు ఆయన ఎంపిక చేసుకున్న కథల్లోని వైవిధ్యతని చాటి చెబుతాయి. మరోసారి అలాంటి ఓ విభిన్నమైన కథతో ఆయన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అల్లరి నేరశ్ ముఖంపై గాయాలతో ఓ మంచాన్ని భుజంపై మోస్తూ కనిపించారు. ఇది చూస్తుంటే ఓ భావోద్వేగపు సన్నివేశానికి సంబంధించిన పోస్టర్లా ఉంది. కాగా, ఈ చిత్రంలో ఆనంది కథానాయిక. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండు నిర్మాత. వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు, శ్రీచరణ్ పాకాల సంగీతం, రామ్‌రెడ్డి ఛాయాగ్రహణం అందించారు.