Chiranjeevi Celebrates Ganesh Chaturthi :మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా వినాయకచవితి పండగ జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు కూడాపాల్గొన్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి పండగ చాలా స్పెషల్ అని మెగాస్టార్ అన్నారు.
"అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి ప్రత్యేకత.. చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫొటోల్లో చిన్నారి 'క్లిన్ కారా' ను ఉపాసన ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. కానీ పాప మెహాన్ని మాత్రం చూపించలేరు. దీంతో క్లిన్ కారా ను చూడాలనుకున్న మెగాఫ్యాన్స్కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇదివరకు కూడా రామ్‌చరణ్-ఉపాసన దంపతులు కూడా పలుమార్లు క్లిన్ కారా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా.. చిన్నారి ఫేస్‌ను చూపలేదు.
ఇక ఈ పూజ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనా దేవితో పాటు ఆయన భార్య సురేఖ.. రామ్‌చరణ్-ఉపాసన, ఆయన కూతుళ్లు సుస్మితా, శ్రీజా, మనవరాళ్లు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన మోగాఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. 'హ్యాపీ గణేశ్ చతుర్థి టు మెగా ఫ్యామిలీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక జూన్ నెలలో మెగా కోడలు కొనిదెల ఉపాసన.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు చిగురించాయి. ఇక నామకరణం రోజు చిన్నారి పేరును 'క్లిన్ కారా' గా మెగాస్టార్ ప్రకటించారు.
ప్రస్తుతం రామ్‌చరణ్.. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్‌తో కలిసి 'గేమ్ ఛేంజర్ 'సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పొలిటికల్ డ్రామా యాక్షన్ జోనర్లో భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తున్నారు. షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Ram Charan Game Changer : రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్".. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..!
మెగా ప్రిన్సెస్ 'క్లీంకార' కోసం స్పెషల్ రూమ్.. లవ్లీ ఫొటోస్ చూశారా ?