తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య.. ఎన్ని సార్లంటే? - 2023 తెలుగు సినిమాలు

చిరంజీవి, బాలకృష్ణల సినిమాలంటే థియేటర్లకు క్యూ కడుతుంటారు అభిమానులు. అలానే ఈ సంక్రాంతికి బరిలో దిగబోతున్న ఈ అగ్రహీరోలిద్దర చిత్రాల కోసం ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇప్పటివరకు ఎన్నిసార్లు సంకాంత్రి బరిలో దిగారు? ఆ చిత్రాలు ఏంటి? ఇంకా ఏఏ సమయాల్లో పోటీపడ్డారు? వంటి విషయాలను తెలుసుకుందాం..

Waltair Veerayya Veerasimha Reddy
Waltair Veerayya Veerasimha Reddy

By

Published : Jan 4, 2023, 3:50 PM IST

టాలీవుడ్‌లో టాప్​ హీరోల లిస్ట్​ చెప్పమంటే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది మెగాస్టార్​ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ పేర్లు. ప్రస్తుతం ఈ హీరోల సినిమాలు సంక్రాంతి కానుకగా ఒక్క రోజు తేడాతో రిలీజ్​ కానున్నాయి. దీంతో అభిమానులు ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్టార్‌ హీరోలు పొంగల్​ రేసులోకి దిగడం ఇదేమి ఫస్ట్ టైమ్​ కాదు. ఇద్దరు నటించిన పలు సినిమాలు సంక్రాంతి రేసులో బరిలోకి దిగి పోటీ పడ్డాయి. మరి ఆ సినిమా లేంటి, ఎప్పుడు వచ్చాయో ఓ సారి చూద్దాం..

2023లో చిరు బాలయ్య సినిమాలు

12న వీరసింహారెడ్డి.. 13కి వాల్తేరు వీరయ్య!..గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. హీరో బాలకృష్ణ, హీరోయిన్​ శ్రుతిహాసన్​ జంటగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇక చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ డైరెక్షన్​లో వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలోనూ శ్రుతిహాసన్​ కథానాయికగా కనిపించడం విశేషం. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​లు, సాంగ్స్​ సినిమాలపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. 'అఖండ'తో విజయం తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. చిరు వింటేజ్‌ లుక్‌, రవితేజ కీలక పాత్ర పోషించిన వాల్తేరు వీరయ్యపై చిరు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీస్​ సంస్థే కావడం మరో విశేషం.

1985లో చిరు బాలయ్య సినిమాలు

చిరు 'పోరాటం'.. బాలయ్య 'బలం'!..చిరంజీవి, బాలకృష్ణ మొదటిసారి సంక్రాంతి రేసులో నిలిచిన సంవత్సరం 1985. 1985 జనవరి 11న విడుదలైన 'చట్టంతో పోరాటం'లో చిరు హీరోగా నటించగా కె. బాపయ్య దర్శకత్వం వహిరించారు. ఇక అదే ఏడాది జనవరి 11న తాతినేని ప్రసాద్‌ తెరక్కెక్కించిన సినిమా 'ఆత్మబలం'. ఇందులో బాలకృష్ణ నటుడిగా మెప్పించగా నటి భానుప్రియ తన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

1987లో చిరు బాలయ్య సినిమాలు

ఇటు మొగుడు..అటు రాముడు!..1987లో కూడా సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు ఆడియన్స్​ను అలరించారు. చిరంజీవి 'దొంగమొగుడు' సినిమా జనవరి 9న విడుదల కాగా, 'భార్గవరాముడు'తో బాలకృష్ణ జనవరి 14న ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం విశేషం.

1988లో చిరు బాలయ్య సినిమాలు

ఈయన దొంగ.. ఆయన పోలీసు!..1988 సంక్రాంతి పందెంలోనూ చిరు, బాలయ్యల చిత్రాలు సందడి చేశాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'మంచిదొంగ' జనవరి 14న రిలీజ్​ అవ్వగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌' మూవీ జనవరి 15న రిలీజ్​ అయ్యింది.

1997లో చిరు బాలయ్య సినిమాలు

అన్నయ్య సెంటిమెంట్‌తో కొట్టారు!..చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన 'హిట్లర్‌', దర్శకుడు శరత్‌ డైరెక్షన్​లో బాలకృష్ణ నటించిన 'పెద్దన్నయ్య' సినిమాలు 1997లోనూ సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఇద్దరూ అన్నయ్య రోల్​లో యాక్ట్​ చేశారు. యాక్షన్‌ హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్​ను మెప్పించే సినిమాల్లోనూ నటించి హిట్​ పొందొచ్చని ఈ రెండు చిత్రాలు రుజువు చేశాయి. 1997 జనవరి 4న ప్రేక్షకుల ముందుకొచ్చి చిరంజీవికి హిట్​ అందించిన హిట్లర్‌ జనవరి 10న విడుదలై బాలయ్యను భలా అనిపించేలా చేసింది పెద్దన్నయ్య సినిమా.

1999లో చిరు బాలయ్య సినిమాలు

స్నేహంకోసం చిరు.. శత్రుత్వం కోసం బాలయ్య!..1999 జనవరిలోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ కనిపించింది. చిరు నటించిన 'స్నేహంకోసం' సినిమా ఆ సంవత్సరం జనవరి 1న విడుదలైంది. డైరెక్టర్​ కె. ఎస్‌. రవికుమార్‌ దీన్ని తెరక్కెక్కించారు. బి. గోపాల్‌ దర్శకత్వంలో బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' జనవరి 13న విడుదలైంది.

2000లో చిరు బాలయ్య సినిమాలు

1997లో అలా.. 2000లో ఇలా!..చిరంజీవి, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్​లో వచ్చిన హిట్లర్​.. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇద్దరు కలిసి 2000లో 'అన్నయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్​ అయ్యింది. ఇలాగే 1997లో పెద్దన్నయ్య సినిమాతో పలకరించిన శరత్- బాలకృష్ణల కాంబో మళ్లీ 2000 సంవత్సరంలో రిపీట్‌ అయింది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'వంశోద్థారకుడు'. ఈ చిత్రం 2000 జనవరి 14న విడుదలైంది. అప్పట్లో ఈ రెండూ కాంబోలు విజయాన్ని సాధించాయి.

2001లో చిరు బాలయ్య సినిమాలు

ఒకేరోజు థియెటర్లోకి..!..అప్పటి వరకూ రోజుల తేడాతో పొంగల్‌ సీజన్‌కు చిరు, బాలయ్యల సినిమాలు రిలీజ్​ అయ్యేవి. కానీ, 2001లో మాత్రం ఈ స్టార్​ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. 'నరసింహనాయుడు'తో బాలకృష్ణ, 'మృగరాజు'తో చిరంజీవి జనవరి 11న అలరించారు.

2004లో చిరు బాలయ్య సినిమాలు

అంజిగా చిరు.. లక్ష్మీనరసింహాగా బాలయ్య!..దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా 'లక్ష్మీనరసింహా'. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం 'అంజి'. ఈ రెండు 2004లో సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి.

2017లో చిరు బాలయ్య సినిమాలు

చిరుకి 150.. బాలయ్యకి 100!.. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరు లాంగ్​ గ్యాప్​ తర్వాత ఖైదీ నంబర్‌ 150 సినిమాతో ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వీ.వీ.వినాయక్‌ దర్శకత్వంలో 2017 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అదే నెల 12న విడుదలైన బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సంక్రాంతి వేళల్లోనే కాదు..!..సంక్రాంతి సమయాల్లోనే కాకుండా వీరిద్దరి సినిమాలు ఒకే ఏడాదిలో వేర్వేరు సందర్భాల్లో విడుదల అయ్యాయి. అవేంటంటే..

  • మంగమ్మగారి మనవడు- బాలకృష్ణ, ఇంటిగుట్టు- చిరంజీవి 1984 సెప్టెంబరులో విడుదలయ్యాయి.
  • కథానాయకుడు- బాలకృష్ణ, రుస్తుం- చిరంజీవి 1984 డిసెంబరులో రిలీజ్​ అయ్యాయి.
  • కొండవీటి రాజా- చిరంజీవి 1986 జనవరి 31న, నిప్పులాంటి మనిషి- బాలకృష్ణ 1986 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
  • రాక్షసుడు- చిరంజీవి, అపూర్వ సహోదరులు- బాలకృష్ణ 1986 అక్టోబరులో సందడి చేశాయి.
  • పసివాడి ప్రాణం- చిరంజీవి, రాము- బాలకృష్ణ 1987 జులైలో థియెటర్లలో ప్రేక్షకుల్ని అలరించాయి.
  • యుద్ధభూమి- చిరంజీవి, రాముడు భీముడు- బాలకృష్ణ 1988 నవంబరులో వచ్చాయి.
  • శ్రీ మంజునాథ- చిరంజీవి, భలేవాడివి బాసూ!- బాలకృష్ణ 2001 జూన్‌లో ఆడియన్స్​ ముందుకు వచ్చాయి.
  • ఇవీ చదవండి:
  • రామ్​చరణ్​పై టైటానిక్​ నటి ప్రశంసల వర్షం​.. బాడీ ఫిట్​నెస్​ అదుర్స్​ అంటూ!
  • సంక్రాంతి టు ఉగాది ఆహా ఓటీటీలో కొత్త చిత్రాలతో నాన్​స్టాప్​ వినోదం

ABOUT THE AUTHOR

...view details